BigTV English

Hrithik Roshan in Realfighter Jets: రియ‌ల్‌ఫైట‌ర్ జెట్స్ లో హృతిక్‌.. ఫైట‌ర్ సీక్రెట్స్

Hrithik Roshan in Realfighter Jets: రియ‌ల్‌ఫైట‌ర్ జెట్స్ లో హృతిక్‌.. ఫైట‌ర్ సీక్రెట్స్
Advertisement
Hrithik Roshan in Realfighter Jets

హృతిక్ రోష‌న్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా ఫైట‌ర్‌. ఆదిత్య చోప్రా తెర‌కెక్కిస్తున్నారు. దీపిక ప‌దుకోన్ నాయిక‌. ఈ సినిమా గురించి హీరో హృతిక్ రోష‌న్ మాట్లాడుతూ మేం ఫైట‌ర్ కోసం రియ‌ల్ ఫైట‌ర్ జెట్స్ ని వాడుతున్నాం. సుఖోయ్‌లో ఈ మ‌ధ్య‌నే తెర‌కెక్కించాం. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చుట్టూ ఉండ‌గా అలా చేయ‌డం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. వాళ్ల వ్యావ‌హారిక శైలిని చూసి మ‌నం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. వాళ్ల క్ర‌మ‌శిక్ష‌ణ‌, వాళ్ల ధైర్యం, వాళ్ల తెలివితేట‌లు, గ్ర‌హించే శ‌క్తి, ఇలాంటివి చూసి ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. వాళ్ల‌తో కాసేపు ఉండ‌గ‌లిగే అదృష్టం నాకు క‌లిగింది. వాళ్ల‌ను చూసి చాలా ఇన్‌స్ప‌యిరింగ్‌గా అనిపించింది అని అన్నారు హృతిక్‌.


వార్ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడారు హృతిక్ ఆదిత్య చోప్రా చాలా సీక్రెట్‌గా ఉంటారు. నా మాట‌ల‌ను బ‌ట్టి మీకు ఏం అర్థ‌మైతే అదే రాసుకోవాలి. ఎందుకంటే నేనేం చెప్ప‌డం లేదు అని అన్నారు. టైగ‌ర్ ష్రాఫ్ కీ రోల్ చేస్తున్న మూవీ వార్‌. సూప‌ర్ హీరో ఫ్రాంఛైజీ క్రిష్‌4 గురించి కాస్త చ‌మ‌త్కారంగా మాట్లాడారు హృతిక్ రోష‌న్‌. మ‌నంద‌రం క‌లిసి దేవుణ్ణి గ‌ట్టిగా కోరుకోవాలి. ఈ ఏడాది చివ‌రికైనా దీని మీద ఓ క్లారిటీ వ‌స్తే బావుంటుంది. క్రిష్ 4 పైప్‌లైన్‌లో ఉంది. త‌ప్ప‌కుండా సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంది అని అన్నారు.

హృతిక్ రోష‌న్ దృష్టి మొత్తం ఇప్పుడు ఫైట‌ర్ మీదుంది. ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అక్ష‌య్ ఒబెరాయ్‌, క‌ర‌ణ్ సింగ్ గ్రూవ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. 2024 జ‌న‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ ఏడాది అదే డేట్‌కి రిలీజ్ కానుంది షారుఖ్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్‌. ఈ ఇయ‌ర్ అండ్ నెక్స్ ఇయ‌ర్ సేమ్ డేట్‌కి రిలీజ్ అవుతున్నాయి దీపిక ప‌దుకోన్ న‌టించిన సినిమాలు.


Follow this link for more updates:- Bigtv

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×