Big Stories

Ranji History: రంజీ చరిత్రలో ‘షా’న్‌దార్ ఇన్నింగ్స్

Ranji History:భారత యువ బ్యాటర్ పృథ్వీ షా మరోసారి అదరగొట్టాడు. రంజీల్లో అసోం జట్టుపై ట్రిపుల్ సెంచరీ బాదడమే కాకుండా… 379 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రంజీల్లో రెండో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో ఎంత ప్రతిభ చూపినా జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా సెలెక్టర్లు విస్మరిస్తున్నా… షా మాత్రం నిరాశ చెందకుండా తనదైన శైలిలో దూకుడుగానే ఆడుతున్నాడు.

- Advertisement -

రంజీల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు భావ్‌సాహెబ్‌ నింబాల్కర్‌ పేరిట ఉంది. మహారాష్ట్రకు చెందిన ఆయన… కథియావర్ జట్టుపై 1948లో 443 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాజాగా ముంబయి తరఫున ఆడుతున్న పృథ్వీ షా… 383 బంతుల్లో 379 రన్స్ చేసి… రంజీల్లో రెండో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రంజీల్లో ఓ ఇన్నింగ్స్‌లో 350కి పైగా పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గానూ రికార్డులకెక్కాడు. ఆట తొలిరోజే డబుల్ సెంచరీ బాదేసిన షా… రెండో రోజు కూడా అదే దూకుడు కంటిన్యూ చేశాడు. 240 పరుగుల వ్యక్తిగత ఓవర్‌నైట్‌ స్కోరు దగ్గర రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన షా… 99 బంతుల్లో మరో 139 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 326 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

- Advertisement -

ఈ మ్యాచ్‌కు ముందు వరకు పృథ్వీ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. గత నాలుగు రంజీ మ్యాచ్‌ల్లో వరుసగా 13, 6, 5, 19, 4, 68, 35 రన్స్ మాత్రమే చేశాడు. తాజాగా ట్రిపుల్ సెంచరీ బాదేసి… మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 6 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ-20 మాత్రమే ఆడిన పృథ్వీ షా… 2021 జులైలో శ్రీలంకలో పర్యటించిన భారత క్రికెట్ జట్టు తరఫున చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇప్పటికైనా సెలెక్టర్లు అతణ్ని కరుణిస్తారో లేదో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News