E-Paper
Advertisement

Hrithik Roshan Reveals Fighters secrets : ఫైట‌ర్ సీక్రెట్స్ రివీల్ చేసిన హృతిక్ రోష‌న్‌

Hrithik Roshan Reveals Fighters secrets : ఫైట‌ర్ సీక్రెట్స్ రివీల్ చేసిన హృతిక్ రోష‌న్‌
Advertisement

Hrithik Roshan Reveals Fighters secrets :ఇండియా ఫ‌స్ట్ ఏరియ‌ల్ యాక్ష‌న్ సినిమా ఫైట‌ర్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు క‌థానాయ‌కుడు హృతిక్ రోష‌న్‌. ఆయ‌న స‌ర‌స‌న దీపిక ప‌దుకోన్ నాయిక‌గా న‌టిస్తున్న చిత్రం ఫైట‌ర్‌. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. 2022లో విక్ర‌మ్ వేదాతో స‌త్తా చాటారు హృతిక్ రోష‌న్‌. త‌మిళ్‌లో మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించిన సినిమా విక్ర‌మ్ వేదా. దాన్ని అదే పేరుతో హిందీలో తెర‌కెక్కించారు. హిట్ అయింది. ప్ర‌స్తుతం ఫైట‌ర్ సెట్స్ మీదున్నారు హృతిక్ రోష‌న్‌. బ్యాంగ్ బ్యాంగ్ త‌ర్వాత సిద్ధార్థ్ ఆనంద్‌తో క‌లిసి న‌టిస్తున్నారు. ఫైట‌ర్‌లో అనిల్ క‌పూర్ కూడా న‌టిస్తున్నారు.

హృతిక్‌, దీపిక ఇద్ద‌రూ ఈ సినిమాలో పైల‌ట్స్ గా క‌నిపిస్తారు. అనిల్ వారిద్ద‌రికీ మెంట‌ర్‌గా క‌నిపిస్తారు. అస్సామ్‌లో ఇటీవ‌ల ప‌ది రోజుల పాటు చిత్రీక‌రించారు. మొనాట‌నీని ఇష్ట‌ప‌డ‌రు హృతిక్‌. అందుకే ఇండియాస్ ఫ‌స్ట్ ఏరియ‌ల్ సినిమా అన‌గానే ఫైట‌ర్‌కి ఓకే చెప్పేశారు. నెక్స్ట్ లెవ‌ల్ వీఎఫ్ఎక్స్ ఉంటాయ‌ట ఈ మూవీలో. ఇండియ‌న్ ఆడియ‌న్స్ కి ఈ సినిమా స‌రికొత్త ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంద‌ట‌. స్కేల్‌, మేకింగ్‌, పెర్ఫార్మెన్స్ లు, బిజినెస్ ప్ర‌తి విష‌యంలోనూ నెవ‌ర్ బిఫోర్ ఎక్స్ పీరియ‌న్స్ టేస్ట్ చేస్తారట ఆడియ‌న్స్. హృతిక్ ఇందులో సూప‌ర్ హీరో త‌ర‌హా పాత్ర‌లో క‌నిపిస్తారు. లార్జ‌ర్ దేన్ లైఫ్‌, సూప‌ర్‌హీరో త‌ర‌హా పాత్ర‌లో మిమ్మ‌ల్ని ప్రొజెక్ట్ చేయాల‌నుకుంటున్నాను అని హృతిక్‌తో చెప్పార‌ట సిద్ధార్థ్ ఆనంద్‌.

Advertisement

ఈ సినిమా చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు హృతిక్‌. జ‌నాల ఎక్స్ పెక్టేష‌న్స్ ని రీచ్ కావ‌డం అంత తేలిక కాదు, అందులోనూ ముందు నుంచే ఇది మ‌రో వండ‌ర్ అని చెబుతున్న‌ప్పుడు, దానికి త‌గ్గ‌ట్టుగా స్క్రీన్ మీద కూడా ఎలివేట్ చేయాలి. లేకుంటే మాట‌కు విలువ ఉండ‌దు. అందుకే ప్రెజ‌ర్ ఉంది అని అంటున్నారు హృతిక్ రోష‌న్‌.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×