BigTV English

Aman Preet Singh Drugs Case: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడికి పాజిటివ్.. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరు..!

Aman Preet Singh Drugs Case: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడికి పాజిటివ్.. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరు..!

Actress Rakul’s Brother Aman Preet Singh Tested +Ve in Drugs Test: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఐదుగురు సభ్యుల డ్రగ్ ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నార్కోటిక్, ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.35 లక్షల విలువ చేసే 199గ్రాముల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. వీరంతా గోవా, ముంబై, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కొకైన్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా, పట్టుబడిన నిందితులకు డ్రగ్ టెస్ట్ చేశారు.


నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు పాజిటివ్ వచ్చింది. అయితే నైజీరియన్స్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ పట్టుబడిన సంగతి తెలిసిందే.

నైజీరియన్ మహిళతో పాటు నలుగురిని నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేసింది. నైజీరియన్ల గ్యాంగ్ లో ఇద్దరు పరారయ్యారు. నైజీరియన్ల వద్ద 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. ఎన్డీపీఎస్ యాక్ట్ 27 కింద అతగి పేరును ఏ6గా చేర్చారు.


Also Read: ఎక్కడ ఉన్నా ఈనెల 18లోగా రావాల్సిందే.. హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు!

నైజీరియన్ మహిళ అనౌహ గత 6 నెలల్లో 20 సార్లు పెద్ద మొత్తంలో హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తేలింది. అనౌహ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నార్కోటిక్ బ్యూరో ప్రయత్నిస్తోంది. అయితే పరారీలో డ్రగ్ కింగ్ పిన్ ఎబుక సుజీ అలియాస్ లేబుక ఇమ్మానియల్ ఉన్నారు. అంతర్జాతీయ సిమ్స్ వాడుతూ వాట్సప్‌లో కాల్స్ తో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడిన నార్సింగి డ్రగ్స్ కేసు నిందితులను కాసేపట్లో ఉప్పర్ పల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×