BigTV English

Raj Tarun – Lavanya Case Update: ఎక్కడ ఉన్నా ఈనెల 18లోగా రావాల్సిందే.. హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు..!

Raj Tarun – Lavanya Case Update: ఎక్కడ ఉన్నా ఈనెల 18లోగా రావాల్సిందే.. హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు..!

Police Sends Notice to Raj Tarun in Lavanya’s Case: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, నటి లావణ్య లవ్ ఎపిసోడ్ వివాదం తీవ్రమవుతూనే ఉంది. తనను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి మోసం చేసిన రాజ్ తరుణ్‌పై నటి లావణ్య కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి రాజ్ తరుణ్‌పై వరుసగా లావణ్య ఆరోపణలు కొనసాగితూనే ఉంది.


నటి మాల్వీ మల్హోత్రాతో సన్నిహితంగా ఉంటూ తనను దూరంగా పెట్టాడని లావణ్య వెల్లడించింది. దీనిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది.

నార్సింగి పోలీసులు మంగళవారం హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఈ మేరకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే బీఎన్ఎస్ఎస్ 45 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.


Also Read: Hot Spot Trailer: ఛీఛీ.. ఏం సినిమారా ఇది.. మరీ ఇన్ని పచ్చి బూతులా.. చిన్న పిల్లతో కూడా..

ఇదిలా ఉండగా, 2008 నుంచి రాజ్ తరుణ్‌తో పరిచయం ఉందని లావణ్య వెల్లడించింది. ఆ తర్వాత మేము ఇద్దరం ప్రేమించుకున్నామని, ఈ తరుణంలో 2014లో రాజ్ తరుణ్ తనను వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదులో లావణ్య తెలపగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రాజ్ తరుణ్‌తో ఓ గుడిలో వివాహం చేసుకున్న అనంతరం రాజ్ తరుణ్ రూ.70 లక్షలు ఇచ్చినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇక 2016లో గర్భం దాలిస్తే..ఇప్పుడే పిల్లలు వద్దంటూ అబార్షన్ చేయించాడని అందులో పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా రాజ్ తరుణ్, మాల్విలపై నార్సింగి పోలీసులు సెక్షన్ 420, 493, 506 కింద కేసులు నమోదు చేశారు.

Also Read: ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్.. స్టోరీ కన్ఫామ్ అయిందా?

రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఈ సమయంలో ఆయనకు పోలీసులు నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా స్వగ్రామమైన హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఎక్కడ ఉన్నా ఈనెల 18వ తేదీలోగా హాజరు కావాలని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×