E-Paper
Advertisement

Hyper Aadi: అల్లు అర్జున్ ను ట్రోల్ చేయకండి.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే

Hyper Aadi: అల్లు అర్జున్ ను ట్రోల్ చేయకండి.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే
Advertisement

Hyper Aadi: ఎన్నికలు అయిపోయినా కూడా ఆ హీట్ ఇంకా తగ్గలేదు. అప్పుడు అల్లు అర్జున్ చేసిన పనికి ఇంకా అతనిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా తన ఫ్రెండ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతు పలికాడు అల్లు అర్జున్. అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి విభేదాలు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.

నాగబాబు మాత్రమే ఈ విషయమై స్పందించాడు. అది కూడా ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేశాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం నెలకొందని కన్ఫర్మ్ అయ్యింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు బన్నీపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

Advertisement

మొన్నటికి మొన్న గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ సైతం ఈ రెండు కుటుంబాల మధ్య వైరం గురించి మాట్లాడాడు.మెగా – అల్లు కుటుంబాలు రెండు ఒకటే అని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే మాటను హైపర్ ఆది సైతం చెప్పుకొచ్చాడు.

అశ్విన్ బాబు హీరోగా నటించిన శివంభజే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న హైపర్ ఆది మాట్లాడుతూ.. ” ఇకనైనా అల్లు అర్జున్ ట్రోల్ చేయడం ఆపండి. ఆయన నేషనల్ అవార్డు విన్నర్. అలాంటి వ్యక్తిని పట్టుకొని ట్రోల్ చేయడం పద్దతి కాదు. కళ్యాణ్ గారికి కానీ, మెగా ఫ్యామిలీకి కానీ ఎవరికి అలాంటి ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. వారంతా ఒకటే. అల్లు అర్జున్ పై ట్రోల్ చేయడం కానీ, థంబ్ నెయిల్స్ పెట్టడం కానీ, ఇకనుంచి ఆపేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×