BigTV English

Anchor Anasuya Request : ‘నాకు కుటుంబం ఉంది.. ప్లీజ్’.. అనసూయ రిక్వెస్ట్..

Anchor Anasuya  Request : ‘నాకు కుటుంబం ఉంది.. ప్లీజ్’.. అనసూయ రిక్వెస్ట్..
Anasuya


Anchor Anasuya Request : కొంతమంది ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. కాంట్రవర్సీ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలి. లేకపోతే కొంతమంది ఆడియన్స్‌కు వారు పర్మనెంట్ టార్గెట్ అయిపోతారు. అలాంటి వారిలో ఒకరు అనసూయ భరద్వాజ్. తనకు ఏది నచ్చకపోయినా సోషల్ మీడియా ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యే అనసూయ.. తాజాగా ప్రేక్షకులకు ఒక రిక్వెస్ట్ పెట్టింది.

‘నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. నేను గతకొంతకాలంగా కొన్ని ట్వీట్స్ చూస్తున్నాను. అందులో రాజకీయ, సినీ పరిశ్రమలో కొందరినీ అగౌరవ పరచడానికి నాతో పోలుస్తున్నారు. నా పేరు ఉపయోగిస్తున్నందుకు నాకు కూడా అగౌరవాన్ని కలిగిస్తోంది. ఈ సమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నాను. ఎవరి విషయంలో తలదూర్చాలి అనుకోవడం లేదు. ఎందుకంటే అదే నన్నే ఎక్కువగా బాధపెడుతుందని నేను తెలుసుకున్నాను’ అని అనసూయ ట్వీట్ చేసింది.


‘అందుకే మీ అందరికీ నాది ఒక రిక్వెస్ట్‌. నేను ఒక సెల్ఫ్ మేడ్ మహిళను. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. ఇది నాకు నేనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు పీఆర్ లాంటి వారు లేరు. అందుకే మీరు నన్ను ప్రోత్సహించాలి, ప్రశంసించాలి అని అనుకోకపోతే నాకు దూరంగా ఉండండి. అంతే కాకుండా నన్ను ఇందులోకి లాగకండి. నేను కరెక్ట్ మార్గంలో ఒక మార్పును తీసుకురావాలని అనుకుంటున్నాను. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. ప్లీజ్’ అని ట్విటర్ ద్వారా ఆడియన్స్‌ను రిక్వెస్ట్ చేసింది అనసూయ.

అనసూయ ఇలా తన మనసులోని మాటలను బయటపెట్టడం కొత్తేమీ కాదు. తనకు ఏది నచ్చకపోయినా.. నెటిజన్లు చేసిన కామెంట్స్ వల్ల తనకు ఎలాంటి బాధ కలిగినా.. వెంటనే రియాక్ట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలని కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా కూడా మళ్లీ వెంటనే యాక్టివ్ అయ్యింది. ఇక తాజాగా అనసూయ చేసిన ఈ రిక్వెస్ట్ పూర్తిగా ఎవరిని ఉద్దేశించి అన్నది తెలుసుకోవడం కోసం కొందరు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×