BigTV English

Cricketer Become Bus Driver : ఒకప్పుడు క్రేజ్ ఉన్న క్రికెటర్లు.. ఇప్పుడు బస్ డ్రైవర్లు..

Cricketer Become  Bus Driver : ఒకప్పుడు క్రేజ్ ఉన్న క్రికెటర్లు.. ఇప్పుడు బస్ డ్రైవర్లు..
Cricketer Become Bus Driver


Cricketer Become Bus Driver : ఫేమ్ ఉన్నప్పుడే ఏదైనా సాధించాలి, లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడే నచ్చింది చేసేయాలి అంటుంటారు. దానికి కారణం ఏంటో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తోంది. ఒకప్పుడు ఎంతో ఫేమ్‌తో జీవితాన్ని గడిపిన వారు కూడా ఒక్కసారిగా కష్టకాలాన్ని దాటవలసి వస్తుంది. ఏ రంగంలో అయినా ఇలా జరగడం కామనే. సినిమా అయినా, క్రికెట్ అయినా.. రిటైర్‌మెంట్ తర్వాత అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఒకప్పుడు మంచి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన పరిస్థితి కూడా ఇదే.

కెరీర్ ఉన్నంత కాలంలో సరిపడా డబ్బులు సంపాదించుకొని ఆర్థిక స్థోమతను బలపరుచుకునే వారు ఉన్నారు. లేదా తమకు ఇష్టమైన ప్రొఫెషన్‌ను వదిలి ఉండలేక రిటైర్‌మెంట్ తర్వాత కూడా అందులోనే ఉద్యోగం చేసేవారు కూడా ఉన్నారు. క్రికెట్‌లో కూడా ఇంతే. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఇప్పటికీ చాలామంది సీనియర్ క్రికెటర్లు కామెంటేటర్లుగా, కోచ్‌లుగా సెటిల్ అయ్యారు. కానీ ఒకప్పుడు శ్రీలంక జట్టులో మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న సూరజ్ రందీప్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది.


ఒకప్పుడు సూరజ్ రందీప్ శ్రీలంక జట్టులో యాక్టివ్ క్రికెటర్. 2011 వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో కూడా సూరజ్.. టీమ్‌లోనే ఉన్నాడు. ఇండియా వర్సెస్ శ్రీలంకగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. 9 ఓవర్లలో 43 రన్స్ ఇచ్చిన సూరజ్ పర్ఫార్మెన్స్ చాలామంది ఆడియన్స్‌లో రిజిస్టర్ అయ్యింది. ఆ తర్వాత తను క్రికెట్‌లో అంత యాక్టివ్‌గా లేడు. ఆపై వెంటనే రిటైర్‌మెంట్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్నాడు. ఉపాధి కోసం అక్కడే బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

శ్రీలంకలో మాజీ క్రికెటర్‌గా ఉన్న సూరజ్ రందీప్ మాత్రమే కాదు మరికొంతమంది మాజీ క్రికెటర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మాజీ ఆల్‌రౌండర్ చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ప్లేయర్ వాడింగ్టన్ మ్వేంగా కూడా సూరజ్‌తో పాటే అదే కంపెనీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఐపీఎల్‌లో, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన ఆటతో గుర్తింపు సాధించుకున్న సూరజ్ జీవితం ఇప్పుడు ఇలా మారిపోయిందని చాలామంది తెలియదు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×