IIFA Digital Awards 2025: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల ప్రధానోత్సవం వేడుక శనివారం చాలా ఘనంగా జరిగింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో మొదటి రోజు బాలీవుడ్ స్టార్స్ అందరూ పాల్గొన్నారు. ఈ వేదికపై అమర్ సింగ్ చంకీలా, పంచాయత్ సినిమాలు అనేక అవార్డులను అందుకున్నాయి. అవార్డుల వేడుకలకు బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ హోస్టుగా వ్యవహరించారు. అటు కరీనా కపూర్(Kareena Kapoor) 25వ ఐఫా ఎడిషన్ లో ప్రదర్శన కూడా ఇచ్చారు. అంతేకాదు ఆమె తాత దిగ్గజ చిత్ర నిర్మాత రాజ్ కపూర్ (Raj Kapoor)కి కూడా అవార్డుల ప్రధానోత్సవం లో నివాళులర్పించడం ఇక్కడ హైలెట్గా నిలిచింది. ఇకపోతే అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకలలో ఎవరు విజేతలుగా నిలిచారు..? ఎవరికి ఏ విభాగంలో అవార్డు లభించింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఐఫోన్ డిజిటల్ అవార్డ్స్ 2025 విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం : అమర్ సింగ్ చమ్కీలా
ఉత్తమ నటుడు : విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)
ఉత్తమ నటి : కృతి సనన్ ( దో పట్టి)
ఉత్తమ దర్శకుడు : ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చమ్కీలా)
ఉత్తమ సహాయ నటి: అనుప్రియ గోయెంకా (బెర్లిన్)
ఉత్తమ కథ ఒరిజినల్ : కనికా ధిల్లాన్ (దో పట్టి )
ఉత్తమ సిరీస్ : పంచాయత్ సీజన్ 3
ఉత్తమ నటి: శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2)
ఉత్తమ నటుడు : జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ దర్శకుడు : దీపక్ కుమార్ మిశ్రా (పంచాయతీ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి : సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ సహాయ నటుడు : ఫైసల్ మాలిక్ ( పంచాయతీ సీజన్ 3)
ఉత్తమ కథ ఒరిజినల్ (సిరీస్) : కోట ఫ్యాక్టరీ సీజన్ 3
ఉత్తమ రియాలిటీ : ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్
ఉత్తమ డాక్యు సిరీస్: యో యో హనీ సింగ్
ఉత్తమ టైటిల్ ట్రాక్: అనురాగ్ సైకియా