E-Paper
Advertisement

Chiranjeevi: మరో అరుదైన గౌరవం అందుకోనున్న మెగాస్టార్..

Chiranjeevi: మరో అరుదైన గౌరవం అందుకోనున్న మెగాస్టార్..
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేమి కాదు.. ఇప్పటివరకు ఆయన ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నారు. ఈ ఏడాదే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఇక తాజాగా చిరు మరో అరుదైన గౌరవం కూడా అందుకోనున్నారు. ప్రస్తుతం IIFA( ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) 2024 వేడుకలకు రంగం సిద్దమైన విషయం తెల్సిందే.

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అబుదాబీలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ నిన్న మాదాపూర్ లో ఘనంగా జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో ఈ వేడుక కళకళలాడిపోయింది. రానా, తేజ సజ్జా ఈసారి ఐఫా వేడుకకు హోస్ట్స్ గా మారారు. వచ్చినవారిని తమ మాటలతో అలరిస్తూ.. గెస్ట్ ల నుంచి మంచి మంచి సమాధానాలను రాబట్టారు.

Advertisement

ఇక ఈసారి ఐఫా.. మెగాస్టార్ ను అరుదైన గౌరవంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అనే అవార్డుతో ఆయనను సత్కరించనున్నారు. దీనికోసం చిరు.. దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన పాత్రలు, కథలు, నటనకు గాను ఈ గౌరవాన్ని అందించనున్నారట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి.. విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలను పెట్టుకోనున్నారు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×