E-Paper
Advertisement

Ilaiyaraaja: కూతురు పోయిన బాధలో ఉన్నా.. ఆ పని చేయలేను.. క్షమించండి

Ilaiyaraaja: కూతురు పోయిన బాధలో ఉన్నా.. ఆ పని చేయలేను.. క్షమించండి
Advertisement

Ilaiyaraaja: సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంగీతం వింటే రాయిలాంటి మనసున్న వారే కాదు రాళ్లు కూడా కరగాల్సిందే. ఆ మ్యూజిక్ లో ఉండే మ్యాజిక్ అలాంటింది. ఎన్ని వేల పాటలు.. ఎన్ని సినిమాలు.. ఎన్ని హిట్స్ .. ఎన్ని రికార్డులు.. ఎన్ని అవార్డులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవు.ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు వస్తుంది అంటే ఫ్యాన్స్ కు పండగే.

ప్రతి ఏడాదిలానే ఈరోజు కూడా ఫ్యాన్స్.. ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని చూసారు. కానీ, ఇళయరాజా మాత్రం అవకాశాన్ని అభిమానులకు ఇవ్వలేదు. ఏడూ ఇళయరాజా పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. ఇంకోపక్క అభిమానులు సైతం చెన్నె లో ఆయన రికార్డింగ్ స్టూడియో బయట ఎప్పుడెప్పుడు మ్యూజిక్ మ్యాస్ట్రో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Advertisement

ఇక ఇళయరాజా బయటకు వచ్చి.. తన 81 వ పుట్టినరోజు వేడుకలను చేయడానికి వచ్చిన అభిమానులను సున్నితంగా అడ్డుకున్నారు. ఈ ఏడాది తాను పుట్టినరోజును జరుపుకోవడం లేదని, తన కూతురు పోయిన బాధ నుంచి ఇంకా బయటకు రాలేదని తెలిపారు. అంత బాధలో ఉన్నా కూడా తన కోసం వచ్చిన అభిమానులకు సెల్ఫీలు ఇచ్చి పంపించారు. మీడియాతో కూడా ఆయన అదే మాట చెప్పారు.

” నేను ఈ ఏడాది పుట్టినరోజును జరుపుకోవడం లేదు. నేను ఇదంతా మీకోసం చేస్తున్నాను.. నా కోసం కాదు. నా కూతురు పోయిన బాధలోనే ఉన్నాను. అందుకే ఎలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకోవడం లేదు.. క్షమించండి” అటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.  కొన్నిరోజుల క్రితం ఇళయరాజా కూతురు భవతరణి క్యాన్సర్ తో పోరాడుతూ మృతిచెందిన విషయం తెల్సిందే. ఇక ఇళయరాజా బాధను అర్ధం చేసుకున్న అభిమానులు.. అక్కడనుంచి నిరాశగా వెనుతిరిగారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×