BigTV English

Hyundai Pending Orders: వామ్మో.. హ్యుందాయ్‌కి డిమాండ్ మాములుగా లేదుగా.. ఇన్ని ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయా!

Hyundai Pending Orders: వామ్మో.. హ్యుందాయ్‌కి డిమాండ్ మాములుగా లేదుగా.. ఇన్ని ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయా!

Hyundai Pending Orders: కస్టమర్లకు కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎప్పుడూ ముందుంటుంది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారైన ఈ హ్యుందాయ్.. భారత మార్కెట్‌లో ఇప్పటికే చాలా మోడళ్లను ఆవిష్కరించి వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే ఎన్నో అద్భుతమైన కార్లతోపాటు స్పోర్ట్స్ యుటీలిటీ వెహికల్(SUV) వంటి కార్లను రిలీజ్ చేసింది.


సేల్స్‌లోనూ టాప్‌లో..

ఇతర కంపెనీల SUVలతో పోల్చితే హ్యుందాయ్ SUVలు బెస్ట్‌ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌‌తోపాటు పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ కార్లకు దేశంలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతూ వస్తుండడంతో సేల్స్‌లోనూ టాప్‌లో నిలిచింది. ఇటీవల ఓ సర్వే నిర్వహించగా గత నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్లు ఎక్కువగా విక్రయించి రికార్డు సృష్టించింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ విడుదల చేయగా.. దీని తర్వాత మార్చి 11న SUV స్పోర్ట్స్ వెర్షన్ N లైన్‌ను విడుదల చేసింది. ఈ క్రెటా SUV విడుదలైనప్పటి నుంచి భారత్ మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.


30 రోజుల్లో 49 వేలపైగా..

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్‌లో కేవలం 30 రోజుల్లోనే మొత్తం 49 వేలకు పైగా వాహనాలను విక్రయించింది. మేలో కంపెనీ మొత్తం విక్రయాల్లో 14,662 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలు సేల్స్ అయ్యాయి. ఇలా మార్కెట్‌లో కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇంకా హ్యుందాయ్ వద్ద మొత్తం 65 వేల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ కార్లను కొనుగోలు చేయాలంటే వెయింటింగ్ చేయాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.

Also Read: కొత్త స్విఫ్ట్ వర్సెస్ టాటా ఆల్ట్రోజ్.. రెండిటిలో విన్నర్ ఎవరంటే?

డిమాండ్ కార్లపై వెయిటింగ్ పీరియడ్

ఎక్కువగా క్రెటా స్పోర్ట్స్ వేరియంట్ N లైన్ కోసం దాదాపు 10 వారాలకుపైగా కూడా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అయితే ఒక్కోసారి సిటీ, డీలర్, వేరియంట్ ఆధారంగా కొంచెం ఎక్కువ లేదా తక్కువగా వెయిటింగ్ పెరగవచ్చని కంపెనీ తెలిపింది. డిమాండ్ ఉన్న కార్లపై వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుందని గ్రహించిన కంపెనీ.. మరిన్ని కార్ల ఉత్పత్తిని మెరుగుపర్చడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్పత్తిని పెంచి వాహనాలను వీలైనంత త్వరగా వినియోగదారులకు పంపిణీ చేయాలని కంపెనీ భావిస్తోంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×