BigTV English

Renu Desai : మరో సినిమాలో రేణు దేశాయ్.. సంచలన పోస్ట్…

Renu Desai : మరో సినిమాలో రేణు దేశాయ్.. సంచలన పోస్ట్…

Renu Desai: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి అందరికీ తెలుసు. పెళ్లికి ముందు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అందులో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేసింది. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నేళ్ల కాపురం తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తరువాత నటి రేణు దేశాయ్ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు తన కష్టసుఖాలను ఆడియన్స్‌తో పంచుకునే రేణు దేశాయ్ తాజాగా సంచలన పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. అయితే ఇటీవల రేణు దేశాయ్‌ ఇద్దరి పిల్లలు పవన్ కల్యాణ్‌తో ఎక్కువగా కనిపిస్తున్నారు.ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో రేణు దేశాయ్‌ కొడుకు, కూతురు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో దర్శనం ఇస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ తిరుమల వెళ్లిన సమయంలో కూడా రేణు దేశాయ్‌ కూతురు కూడా పక్కనే ఉన్నారు. పిల్లలు ఎప్పుడు తండ్రికి దగ్గరగానే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు.. తనకు నచ్చని వాటిని కడిగి పడేస్తారు.

ఇదిలా ఉండగా.. ఈమె ఈ మధ్య సినిమా ఫంక్షన్స్ కు వెళ్తుంది. పలు షోలకు జడ్జిగా వ్యవహారిస్తుంది. అయితే మొన్నీ మధ్య ఓ సినిమాలో నటించి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా ఆమె తన ఫ్యాన్స్కు  గుడ్ న్యూస్ అందించారు. ఆమె మరో సినిమా లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. షూటింగ్‌ లో పాల్గొనడం కోసం. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాను అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. దాంతో పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఆమె ఏ సినిమాలో నటిస్తుంది అనేది మాత్రం తెలియలేదు..త్వరలోనే ఆ డీటెయిల్స్ తెలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. గతంలో రవి తేజా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల ను చేస్తారో లేదో చూడాలి.. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు ఒక్కొక్కటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఫ్యూచర్ లో అయిన సినిమాలు చేస్తారేమో చూడాలి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×