BigTV English

Bhuma Akhila Priya Vs Jagan : అలా ఎలా కూర్చుంటావ్… మామ కోడళ్ల సవాల్, ప్రతి సవాల్

Bhuma Akhila Priya Vs Jagan : అలా ఎలా కూర్చుంటావ్… మామ కోడళ్ల సవాల్, ప్రతి సవాల్

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడి వాతావరణం సంతరించుకుంది. ఈ మేరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన సందర్భంగా ఉద్రిక్తతకు దారి తీసింది. తన మామ జగన్మోహన్ రెడ్డికి, అఖిలప్రియకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జరిగాయి.


నంద్యాలలోని విజయ పాల డైరీ పరిశ్రమను మంగళవారం టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే డైరీలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.  దీంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాజీ సీఎం జగన్ ఫొటోలను తొలగించి, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేశారు. అనంతరం జగన్ ఫొటోలు అలాగే ఉంచిన సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. ఇక టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదన్నారు.


అలా ఎలా కూర్చుంటావ్..

డైరీకి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చారన్న సమాచారం మేరకు విజయ పాల డైరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆమెకు ఫోన్ చేశారు. తన కుర్చిలో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను ఆయన నిలదీశారు.

సిబ్బంది కూర్చోమంటేనే తాను కూర్చున్నానని అఖిల బదులివ్వగా, తన అనుమతి లేకుండా తన సీట్లో కూర్చోనేందుకు నువ్వెవరంటూ ప్రశ్నించారు. దీంతో  అఖిల ప్రియ సైతం అదే రీతిలో సమాధానం చెప్పింది. గతంలో మా కుర్చీలో మీరు కుర్చేలేదా అంటూ గుర్తు చేసింది.  బెదిరిస్తున్నావా… నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దామని అఖిల ప్రియ తన మామకు సవాల్ విసిరారు. ఈ ఫోన్ సంభాషణతో కర్నూలులో పొలిటికల్ హీట్ పెరిగినట్టైంది.

also read : ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ కేసులోకి ఈడీ రంగప్రవేశం… రూ.23.54 కోట్లు సీజ్

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×