E-Paper
Advertisement

 Indian 2 Teaser : కం బ్యాక్ ఇండియన్.. ఒక టీజర్ తో ప్రభంజనం సృష్టించిన శంకర్..

 Indian 2 Teaser : కం బ్యాక్ ఇండియన్.. ఒక టీజర్ తో ప్రభంజనం సృష్టించిన శంకర్..
Advertisement
Indian 2 Teaser

Indian 2 Teaser : లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నారు. 1996లో కమల్ హాసన్ డబల్ యాక్షన్ లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ మూవీ ఎండింగ్ లో టెలిఫోన్ బూత్ నుంచి కాల్ చేసి కమల్ హాసన్, ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను భారతీయుడికి ఎండింగ్ ఉండదు అంటాడు. దీంతో నెక్స్ట్ సీక్వెల్ ఉంటుంది అన్నట్లు క్లూ వదలడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు దీనికి సీక్వెల్ ఉంటుందో ఉండదో అని ఆలోచిస్తున్న వారికి సమాధానం గా ఇప్పుడు భారతీయుడు 2 విడుదల కాబోతోంది.

రీసెంట్ గా కమల్ విక్రమ్ సినిమా ఊహించని సక్సెస్ అందుకోవడంతో రాబోయే చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ పూర్తయిపోయాయి. ఇప్పటికే కమల్ కు సంబంధించిన అన్ని సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ అయింది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్.. భారతీయుడు ఇంట్రో ఓ రేంజ్ లో కేక పుట్టిస్తోంది. ఇదే కదా కమల్ నుంచి కావలసింది అని ఎగ్జిట్ అవుతున్నారు అతని అభిమానులు. తెలుగులో ఈ ఇంట్రో దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.

Advertisement

ఇక ఇంట్రో విషయానికి వస్తే కం బ్యాక్ ఇండియన్ అంటూ సాగే పాట గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది. ఇంట్లో స్టార్టింగ్ భారతీయుడు 1 ఎండింగ్ సీన్ తో మొదలుపెట్టారు..ఇక ఎండింగ్ సుభాష్ చంద్రబోస్ గెటప్ లో నమస్తే ఇండియా భారతీయుడు ఇస్ బ్యాక్ అంటూ ముగించారు. అన్యాయం పెరిగే కొద్దీ తట్టుకోవడం కష్టమైన ప్రజలు భారతీయుడుని తిరిగి రమ్మంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తారు. ఇక ఏ.జే సూర్య ఇందులో విలన్ గా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అంజలి, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం కీలక పాత్రను పోషిస్తున్నారు. మొత్తానికి ఒక్క చిన్న వీడియో తోటే చిత్రంపై శంకర్ భారీ అంచనాలు పెంచేశాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×