BigTV English
Advertisement

Salaar : సలార్ లో హాలీవుడ్ స్టైల్ ఫైట్స్.. ఫ్యాన్స్ క్రేజీ డైలాగ్స్

Salaar : సలార్ లో హాలీవుడ్ స్టైల్ ఫైట్స్.. ఫ్యాన్స్ క్రేజీ డైలాగ్స్

Salaar : ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 మూవీస్ లో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబో లో వచ్చే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే ప్రభాస్ సలార్ మూవీ గురించి చిన్న న్యూస్ వచ్చినా సరే వెంటనే అది సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ మూవీలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శృతిహాసన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఫైటింగ్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ప్రభాస్ సలార్ చిత్రం కోసం డార్లింగ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు .ఇప్పటికే సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కావలసిన ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా బరిలోకి దిగుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో విలన్ గా మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇందులో ఫైటింగ్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయట. మరి ముఖ్యంగా ఒక సీన్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఒక్క సీన్ కోసం సుమారు 750 కి పైగా విభిన్న వాహనాలను ఉపయోగించారు. పైగా ఈ యాక్షన్స్ అన్నివేసం ఎక్కువ శాతం గ్రౌండ్ పైనే ఉండేలా డిజైన్ చేశారట. కార్, జీప్ ,టాంకర్ ,ట్రక్కులు, బైక్ లు, స్కూటీలు ఇలా అన్ని వాహనాలను వాడేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఒక్క యాక్షన్ సీన్ నే ఇంతగా హైలైట్ చేస్తే.. ఇక మొత్తం సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. బాహుబలి తర్వాత మంచి సక్సెస్ ఆశిస్తున్న ప్రభాస్ కు సలార్ కచ్చితంగా ధమాకా విక్టరీ ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×