E-Paper
Advertisement

Sree Vishnu: ట్రాన్స్ జెండర్ గా మారిన స్టార్ హీరో.. ?

Sree Vishnu: ట్రాన్స్ జెండర్ గా మారిన స్టార్ హీరో.. ?
Advertisement

Sree Vishnu: సినిమా.. చూసేవాళ్లకు ఇదొక వినోదం.. కానీ, చేసేవాళ్లకు ఇదే ప్రపంచం. ఒక పాత్ర కోసం హీరోలు ఎంతకైనా తెగిస్తారు. ఏది నేర్చుకోమన్నా నేర్చుకుంటారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఒకప్పుడు హీరోలు అంటే.. హీరోయిజం మాత్రమే చూపించాలి. వందమందిని ఒక్క చేత్తో కొట్టాలి అనేలా ఉండేవి క్యారెక్టర్లు. కానీ, ఇప్పుడు అలా కాదు. పాత్ర ఏదైనా కథను అనుగుణంగా ఉంటే ప్రేక్షకులు సైతం అంగీకరిస్తున్నారు.. ఆదరిస్తున్నారు.

ఇక ఇప్పటివరకు చాలామంది సీనియర్ హీరోలు చీరలు కట్టి.. అమ్మాయిల వేషధారణలో కనిపించారు. మరికొంతమంది రిస్క్ చేసి ట్రాన్స్ జెండర్స్ పాత్రలో నటించారు. తాజాగా మరో కుర్ర హీరో కూడా అదే లిస్ట్ లో చేరాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించి.. మంచి కథలను ఎంచుకొని హీరోగా మారాడు శ్రీ విష్ణు. ఈ మధ్యనే ఓం భీం బుష్ లో గే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు ఇప్పుడు స్వాగ్ అనే సినిమాతో రాబోతున్నాడు.

Advertisement

అచ్చ తెలుగు సినిమా అంటూ ప్రకటించిన ఈ చిత్రానికి హషిత్ గోలీ దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రీతువర్మ నటిస్తుండగా.. మీరా జాస్మిన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే స్వాగ్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మగజాతిని కాపాడడానికి వచ్చిన స్వాగణిక వంశస్తుల రాజుగా శ్రీవిష్ణు కనిపించనున్నాడని ఇప్పటికే తెలిసింది.

అయితే ఇదే కాకుండా ఇందులో ఈ కుర్ర హీరో దాదాపు 14 గెటప్స్ లో కనిపించనున్నాడట. అందులో ట్రాన్స్ జెండర్ పాత్ర కూడా ఒకటి ఉందని సమాచారం. ఒకప్పుడు ఇలాంటి పాత్రలు చేస్తే.. ఛీఛీ హీరోలు ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అనేవారు. కానీ, ఇప్పుడు కథకుఅనుగుణంగా ఉంటే ఓకే అనేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×