BigTV English

Maruti Dream Series Edition: మారుతీ నుంచి డ్రీమ్ సిరీస్ కార్లు.. బుకింగ్స్ స్టార్ట్!

Maruti Dream Series Edition: మారుతీ నుంచి డ్రీమ్ సిరీస్ కార్లు.. బుకింగ్స్ స్టార్ట్!

Maruti Dream Series Edition: మారుతి ఆల్టో కె10, సెలెరియో, ఎస్-ప్రెస్సో డ్రీమ్ ఎడిషన్‌లు త్వరలో విడుదల కానున్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, తక్కువ వేరియంట్‌లలో సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు డ్రీమ్ సిరీస్ ఎడిషన్‌లో తీసుకురానున్నాయి కంపెనీలు. ఈ కొత్త ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రీమ్ ఎడిషన్‌లు జూన్ 4న ప్రారంభమవుతున్నాయి.


మారుతి సుజుకి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలను పెంచడానికి జూన్ 4న కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేయనుంది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ డ్రీమ్ సిరీస్ పేరుతో విడుదల కానుంది. ఇది ఆల్టో కె10, సెలెరియో, ఎస్-ప్రెస్సోతో పాటు రూ. 4.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందించబడుతుంది. వీటి బుకింగ్స్ నేటి నుండి స్టార్ట్ అయ్యాయి.

Also Read:MG మోటార్స్ నుంచి కొత్త SUV.. జూన్ 5న లాంచ్!


డ్రీమ్ సిరీస్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను తక్కువ వేరియంట్‌లలో అందిస్తుంది. ఈ కొత్త ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియోలు వరుసగా రూ. 3.99 లక్షలు, రూ. 4.26 లక్షలు మరియు రూ. 5.36 లక్షల ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి.

ఏప్రిల్ 2024లో ఈ మోడళ్ల సేల్స్ స్టాటిస్టిక్స్‌ను పరిశీలిస్తే మారుతి సుజుకి ఆల్టో, ఎస్-ప్రెస్సో 11,519 యూనిట్లను సక్సెస్‌ఫుల్‌గా విక్రయించింది. అయితే గతేడాది కాలానికి పరిశీలిస్తే అందులో తగ్గుదల కనిపించింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఈ మోడల్స్ 14,110 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఆల్టో K10, సెలెరియో, S-ప్రెస్సో డ్రీమ్ ఎడిషన్ 1.0-లీటర్, 3-సిలిండర్, NA పెట్రోల్ ఇంజన్‌తో 66 bhp పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎడిషన్‌లు 5-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా కంపెనీ తన ఆటో గేర్ షిఫ్ట్ (AGS) ప్రొడక్షన్‌ని రూ. 5000 తగ్గిస్తున్నట్లు తెలిపింది.

Also Read: మారుతీ, స్కోడా, హోండా నుంచి రానున్న కార్లు ఇవే!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ చాలా చోట్ల RTO రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి రూ. 5.00 లక్షలుగా ఉంది. కాబట్టి కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేము ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను వ్యూహాత్మకంగా రూ. 4.99 లక్షల ధరకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×