E-Paper
Advertisement

Mahesh Babu’s Marriage:- మహేష్ బాబు పెళ్లిపై ఇంట్రస్టింగ్ స్టోరీ.. నమ్రత అలాంటి అమ్మాయి అనేసిన సూపర్‌స్టార్ కృష్ణ

Mahesh Babu’s Marriage:- మహేష్ బాబు పెళ్లిపై ఇంట్రస్టింగ్ స్టోరీ.. నమ్రత అలాంటి అమ్మాయి అనేసిన సూపర్‌స్టార్ కృష్ణ
Advertisement

Mahesh Babu’s Marriage:- మహేశ్ బాబు ఎందుకంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. అఫ్‌కోర్స్ అది సీక్రెట్ కాదు.. కాని, ఒక సూపర్ స్టార్ తనయుడిగా మహేశ్ బాబు రేంజ్‌లో మాత్రం జరగలేదనేది నిజం. అప్పటికే, మహేశ్ బాబుకు రాజకుమారుడు అనే పేరు. అమ్మాయిల రాకుమారుడు. అలాంటి మహేశ్ బాబు పెళ్లి.. అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో మహేశ్-నమ్రత వివాహం జరిగింది.

Advertisement

మహేశ్ బాబు పెళ్లిపై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అందులో నిజానిజాలు ఎంతో తెలీదు గానీ.. మహేశ్ పెళ్లికి అడ్డుపడింది తండ్రి సూపర్ స్టార్ కృష్ణనే అంటున్నారు. నమ్రతను మహేశ్ బాబు పెళ్లి చేసుకోవడం కృష్ణకు ఏమాత్రం ఇష్టం లేదట. ఎంతగా కన్విన్స్ చేసినా సరే.. కృష్ణ మాత్రం నో అనే చెప్పేవాడట. చివరికి ఇందిర జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నమ్రత గురించి తెలుసుకుని, తన అభిప్రాయం కనుక్కుని మరీ కృష్ణకు నచ్చజెప్పింది. ఒకరకంగా మహేశ్-నమ్రత పెళ్లి జరగడానికి కారణం ఇందిరనే అని చెప్పాలి.

ఇంతకీ కృష్ణ ఎందుకు పెళ్లికి ఒప్పుకోలేదు. కారణం ఒక్కటే.. నమ్రత నార్త్ ఇండియన్. పైగా మోడలింగ్ రంగం నుంచి వచ్చిన అమ్మాయి. నార్త్ నుంచి వచ్చే అమ్మాయిలు అనగానే కృష్ణకు ఓ అభిప్రాయం ఉండేదట. ఎప్పుడూ ఫ్యాషన్ అంటూ తిరగడమే తప్ప.. మ్యారేజ్ లైఫ్ సరిగ్గా ఉండదనే అభిప్రాయంలో ఉండేవారట. ఒకవేళ అలాంటి యాటిట్యూడే ఉంటే.. మహేశ్ వివాహ జీవితం సరిగా ఉండదనే భయం పట్టుకుందట కృష్ణకు. ఏదైనా చిన్న గొడవ వస్తే విడాకులు అంటూ వెళ్లిపోతారని, అందుకే నమ్రతతో పెళ్లికి ఒప్పుకోలేదని అంటున్నారు. కాని, నమ్రత గురించి పూర్తిగా వాకబు చేసి, ఆమె మనస్తత్వం తెలుసుకున్న ఇందిర… కృష్ణను ఒప్పించారని చెబుతున్నారు.

Advertisement

ఎంత కన్విన్స్ చేసినా.. ఎందుకనో అసంతృప్తిగానే అంగీకరించిన కృష్ణ.. పెద్ద హడావుడి చేయకుండానే మహేశ్ వివాహం జరిపించాడు. ఇప్పుడు చూస్తే.. కృష్ణ అంచనా వేసినట్టుగా కాకుండా.. చాలా పద్దతిగా కాపురం చేసుకుంటోంది నమ్రత. సినిమాలు మానేసి ఇంటి పట్టునే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది. ఇప్పుడు మహేశ్ సినిమాలు, వ్యాపారాలు, యాడ్స్ కూడా చూసుకుంటోంది నమ్రత. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×