E-Paper
Advertisement

OTT:-  ఓటీటీలు లైట్ తీసుకుంటున్నాయ్ బ్రదర్… ఫ్లాప్ ఎక్కడైనా ఫ్లాపే అంటున్నాయ్

OTT:-  ఓటీటీలు లైట్ తీసుకుంటున్నాయ్ బ్రదర్… ఫ్లాప్ ఎక్కడైనా ఫ్లాపే అంటున్నాయ్
Advertisement

OTT:- ఓటీటీలు స్ట్రాటజీ మార్చుకున్నాయి. ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఈ మధ్యే నేర్చుకుంటున్నాయి. మార్కెటింగ్ విషయంలోనూ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. సినిమా రేంజ్‌ను బట్టి మార్కెటింగ్, పబ్లిసిటీ చేస్తున్నాయి ఓటీటీలు. ఈమధ్య రిలీజ్ అయిన రావణాసుర సినిమానే అతిపెద్ద ఉదాహరణ.

రవితేజ నటించిన రావణాసుర సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా చాలా సైలెంట్‌గా. నిజానికి ఒక కొత్త సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే ముందు విపరీతమైన పబ్లిసిటీ చేసేవి. అందునా, రవితేజ సినిమాకు కచ్చితంగా పబ్లిసిటీ చేయాల్సిందే, మార్కెటింగ్ చేసుకోవాల్సిందే. కాని, అలా చేయలేదు అమెజాన్. అభిమానులకు షాక్ ఇస్తూ సైలెంట్‌గా దించేసింది.

Advertisement

సినిమాకు హిట్ టాక్ వస్తేనే టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాలనుకుంటోంది అమెజాన్. ఒకవేళ థియేటర్లో డిజాస్టర్ అయితే… ఇక పబ్లిసిటీ కోసం డబ్బు వేస్ట్ చేయకూడదనుకుంటోంది. అది ఎంత పెద్ద హీరో అయినా సరే. థియేటర్లలో హిట్ అయితేనే లెక్క. లేదంటే… విత్ ఔట్ పబ్లిసిటీ ఓటీటీలోకి తీసుకొస్తోంది.

కేవల రవితేజ రావణాసుర సినిమా మాత్రమే కాదు.. ఈమధ్య హంట్ సినిమాను కూడా అలాగే తీసుకొచ్చింది సైలెంట్ గా. రంగమార్తాండ, ఎమిగోస్ సినిమాలకు కూడా పబ్లిసిటీ ఇవ్వలేదు. గతంలో ఎంత చిన్న సినిమా అయినా సరే.. త్వరలో మీ అమెజాన్‌లో అంటూ టీవీల్లో ప్రకటనలు ఇచ్చేది. కాని, ఇప్పుడు అనవసరంగా డబ్బు వేస్ట్ చేయకూడదు అనుకుంటోంది అమెజాన్. థియేటర్లో హిట్ అయిన సినిమాకు మాత్రమే కొంత బడ్జెట్ పెట్టి పబ్లిసిటీ చేయాలనుకుంటోంది. దసరా సినిమానే ఇందుకు ఎగ్జాంపుల్. వంద కోట్లు రాబట్టిన దసరా సినిమాను… అమెజాన్ బాగా ప్రమోట్ చేసుకుంది. ఇప్పటికీ చేస్తోంది కూడా. అలాంటి వాటికి ఖర్చుపెడితే లాభం తప్ప… ఫ్లాప్ సినిమాలకు కూడా బడ్జెట్ పెట్టడం ఏంటనే ఆలోచనలో పడింది అమెజాన్. నిజంగా తప్పేం లేదులెండి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×