E-Paper
Advertisement

Movies: ఈ ఏడాది రాబోతున్న ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీలు ఇవే..

Movies: ఈ ఏడాది రాబోతున్న ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీలు ఇవే..
Advertisement

Movies: ఎన్ని సినిమాలు వచ్చినా లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఉండే క్రేజే వేరు. ప్రతి ఏడాది వచ్చే సినిమాల్లో సగానికి సగం లవ్ సినిమాలే ఉంటాయి. యువతను ఎక్కువగా ఇటువంటి సినిమాలు ఆకట్టుకుంటాయి. 2022లో లవ్‌స్టోరీ నేపథ్యంలో వచ్చిన ‘సీతారామం’, ‘18 పేజిస్’, ‘విరాటపర్వం’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.

శాకుంతలం:

Advertisement

గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న తాజా చిత్రం ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంత-దుష్యంతుల ప్రేమకావ్యం అధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఖుషి:

Advertisement

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. కశ్మీర్ నేపథ్యంలో విభిన్న ప్రేమకథాంశంతో తెరకెక్కితున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

వినరో భాగ్యము విష్ణుకథ:

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశీ కాంబినేషన్‌లో వస్తున్న లవ్‌స్టోరీ ‘వినరో భాగ్యము విష్ణుకథ’. దర్శకుడు మురళీ కిషోర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ వినూత్న లవ్ స్టోరీ ఫిబ్రవరి 18న థియేటర్లలో సందడి చేయనుంది.

దసరా

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీలో యాక్షన్ మోడ్‌లో రూపొందుతున్నప్పటికీ అంతర్లీనంగా మంచి ప్రేమకథ ఉందని సినీనిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈమూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×