BigTV English

Blood Cancer Centre:ఇండియాలోనే అతిపెద్ద బ్లడ్ క్యాన్సర్ సెంటర్ అభివృద్ధి..

Blood Cancer Centre:ఇండియాలోనే అతిపెద్ద బ్లడ్ క్యాన్సర్ సెంటర్ అభివృద్ధి..

Blood Cancer Centre:ఒకప్పుడు కొన్ని వ్యాధులు.. వైద్యులకు కూడా అంతుచిక్కకుండా ఉండి.. పేషెంట్ల ప్రాణాలను తీసేవి. కానీ ఇప్పుడు చికిత్స లేని వ్యాధి లేదు. ఆఖరికి క్యాన్సర్ లాంటి కఠినమైన వ్యాధిని కూడా ఫస్ట్ స్టేజ్‌లోనే కనిపెడితే.. పేషెంట్ల ప్రాణాలు పోకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఎన్నో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్స్ ఏర్పడ్డాయి. తాజాగా బ్లడ్ క్యాన్సర్ కోసమే ప్రత్యేకంగా ఒక ట్రీట్మెంట్ సెంటర్ డెవలప్ కానుంది.


టాటా మెమోరియల్ సెంటర్ (టీఎమ్సీ) ఖర్గర్ క్యాంపస్‌లో ఉన్న రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఆక్ట్రెక్)లో బ్లడ్ క్యాన్సర్‌కు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రీట్మెంట్ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయనుంది. పలువురు కేంద్ర మంత్రులు కలిసి ఇటీవల ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలోని బ్లడ్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ ఇస్తున్న అతిపెద్ద ట్రీట్మెంట్ సెంటర్ హెమటోలిమ్ఫాయిడ్ క్యాన్సర్ సెంటర్‌ త్వరలోనే తన రూపాన్ని మార్చుకోనుంది.

2024 చివరిలోపు హెమటోలిమ్ఫాయిడ్ సెంటర్ కొత్త మెరుగులు దిద్దుకోనుంది. దాదాపు 930 వరకు అక్కడ బెడ్ కెపాసిటీ పెంచాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆక్ట్రెక్‌లో మొత్తం 19 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ఏడాదికి కనీసం 10,000 మేజర్ క్యాన్సర్ సర్జరీలు, 5000 మంది పేషెంట్లకు రేడియోషన్ థెరపీ, 25,000 నుండి 30,000 మంది పేషెంట్లకు కీమోథెరపీ అందే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


పేషెంట్లు పెరిగేకొద్దీ స్టాఫ్ కూడా పెరిగాల్సిన అవసరం ఉంది. ఆక్ట్రెక్‌లో స్టాఫ్‌ను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆ క్యాన్సర్ సెంటర్‌లో పేషెంట్లకు వెయిట్ లిస్ట్‌లోనే ఎక్కువ సమయం గడుస్తోంది. ఇకపై అలా జరగకుండ ఉండేలా వారు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 1067 మంది స్టాఫ్ ఉండగా.. దానిని 3,472కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇకపై అక్కడ వైద్యం సమయానికి జరగక ప్రాణాలు కోల్పోయే పేషెంట్లు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×