BigTV English
Advertisement

Mahesh Babu:- మహేశ్ ఇక దుబాయ్‌లోనే ఉండబోతున్నాడా? దుబాయ్ కాస్ట్లీ విల్లా

Mahesh Babu:- మహేశ్ ఇక దుబాయ్‌లోనే ఉండబోతున్నాడా? దుబాయ్ కాస్ట్లీ విల్లా

Mahesh Babu:- టాలీవుడ్ సినీ సర్కిల్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు కంప్లీట్‌గా తన మకాం ఇక దుబాయ్‌కి మార్చేస్తాడా ఏంటా అని. ఈ మధ్యే దుబాయ్‌లో చాలా ఖరీదైన విల్లా కొన్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిజానికి ఇలా విలాసవంతమైన విల్లాలు కొనడం హీరోలకు కొత్తేం కాదు. అలా కొన్నంత మాత్రాన అక్కడికి వెళ్లి సెటిల్ అయిపోతారన్న గ్యారెంటీ కూడా ఏం లేదు. ఒకప్పుడు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నా సరే… ముంబైలో ఒకటి, చెన్నైలో ఒకటి, బెంగళూరు, గోవాలో ఇళ్లు కొనుక్కున్న వారు ఉన్నారు. ఇప్పుడు విదేశాల్లో కొంటున్నారు. అంతే తేడా. అయినా… పొలిటీషియన్స్ కొనగా లేనిది సినీ హీరోలు, హీరోయిన్లు కొనడంలో తప్పేం లేదు. ఒక్క మహేశ్ బాబు మాత్రమే కాదు.. మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖ హీరోలకు ఇప్పటికే దుబాయ్‌లో ఇళ్లున్నాయి. వీకెండ్, ఇయర్ ఎండ్ లేదా మరేదైనా ప్రైవేట్ ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా దగ్గరి వ్యక్తులను పిలిచి పార్టీలు చేసుకుంటారు.


తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. బాగా పేరున్న ఓ బిల్డర్ నుంచి హైఎండ్ పాష్ విల్లా కొన్నాడని టాక్. బాగా రిచ్ ఏరియాలో, సముద్రతీరం కనిపించే కాస్ట్లీయెస్ట్ ప్రాంతంలో ఈ విల్లా కొన్నాడని చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాపర్టీ కోసం ముందుగానే డబ్బు చెల్లించినప్పటికీ.. ఇంకా గృహప్రవేశం చేయలేదని తెలుస్తోంది. ఇంకా కొన్ని ప్రిపరేషన్ పనులు మిగిలిపోవడంతో కొంత టైం పడుతుందని చెబుతున్నారు. ఈ పనులు కూడా అయిపోతే… ఇక రిజిస్ట్రేషన్ ఒక్కటే మిగిలిందంటున్నారు. ఈ రిజిస్ట్రేషన్ పనుల కోసం రెండు మూడు రోజులు దుబాయ్‌లోనే ఉంటాడని కూడా చెప్పుకుంటున్నారు.

టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మహేశ్ బాబు ఒకరు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు మహేశ్ బాబు 65 నుంచి 70 కోట్ల రూపాయల దాకా రెమ్యునరేషన్ కింద తీసుకుంటున్నాడని టాక్. మొన్నటి వరకు 50 కోట్లు తీసుకునే మహేశ్… త్రివిక్రమ్ సినిమాకు 70 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక రాజమౌళి సినిమాకు ఎంత తీసుకుంటాడో. 


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×