BigTV English
Advertisement

Akkineni’s:- అక్కినేని వారసులు వెనకబడుతున్నారు… నందమూరి, మెగా వారసులు దూసుకెళ్తున్నారు

Akkineni’s:- అక్కినేని వారసులు వెనకబడుతున్నారు… నందమూరి, మెగా వారసులు దూసుకెళ్తున్నారు

Akkineni’s:- అఖిల్ ఏజెంట్ సినిమా ఓ రేంజ్‌లో ఆడుతుందని బోలెడు ఆశలు పెట్టుకుంది అక్కినేని ఫ్యామిలీ. అఖిల్ ఒక్కడు గాడినపడితే.. అక్కినేని ఫ్యామిలీ తిరిగి చూసుకోనక్కర్లేదు అనే ఫీలింగ్‌లో ఉంది. కాని, ఎక్కడో తేడా కొడుతోంది. అఖిల్ స్టోరీ సెలక్షన్ అంత గొప్పగా ఉండడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అటు నాగచైతన్య కూడా హిట్లు ఫ్లాప్‌ల మధ్యే కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఓవైపు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లంతా పాన్ ఇండియా వైపు అడుగులు వేశారు. కాని, ఇండస్ట్రీలో ఏఎన్నార్ ఫ్యామిలీ నుంచి ఎవరూ ఆ ప్రయత్నమే చేయలేదు. ఏజెంట్‌తో ఆ ప్రయత్నం చేసినా బెడిసికొట్టింది.


మరోవైపు నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. సలార్, కొరటాల మూవీతో సహా వచ్చేవన్నీ పాన్ ఇండియానే. పైగా కల్యాణ్ రామ్, బాలకృష్ణ మంచి సక్సెస్‌తో, రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్నారు.

మెగా వారసులు కూడా సత్తా చాటుతున్నారు. రీసెంట్‌గా విరూపాక్ష రూపంలో సాలిడ్ హిట్ కొట్టాడు తేజ్. ఈ సినిమాను త్వరలోనే పాన్ ఇండియాగా రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా హీరో అయ్యారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీనే. పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాడు అల్లు అర్జున్. ఇక చిరంజీవి కూడా మంచి సక్సెస్ మీదున్నాడు. పవన్ కల్యాణ్ సైతం పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు.


ఎటొచ్చీ అక్కినేని వారసులే డీలా పడిపోయారు. ఈవెన్ నాగార్జున కూడా హిట్లు కొట్టలేకపోతున్నాడు. బంగార్రాజు మాత్రమే ఈమధ్య వచ్చిన హిట్. నాగచైతన్యకు హిట్స్ వచ్చినా.. అవేం రికార్డ్ కలెక్షన్స్ కావు. ముందు టాలీవుడ్‌లో నిరూపించుకుంటే… పాన్ ఇండియా వైపు అడుగులు వేయొచ్చు. కాని, ఇప్పట్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆ సక్సెస్ వస్తుందా అంటే సందేహమే.

తెలుగు సినిమా పరిశ్రమ అంటేనే నందమూరి, అక్కినేని ఫ్యామిలీలు, ఆ తరువాత చెప్పుకునేది మెగా వారసులే. అటు కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు సైతం దూసుకెళ్తున్నాడు. ఘట్టమనేని ఇంటి బాధ్యతను ఒక్కడే మోస్తున్నా… సక్సెస్ తీసుకొస్తున్నాడు. అందరికీ భారీ సక్సెస్‌లే వస్తున్నాయి. ఒక్క అక్కినేని ఫ్యామిలీకి తప్ప. 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×