E-Paper
Advertisement

Mega vs Allu War: మెగా vs అల్లు వార్.. ఇంత నెగెటివిటీ మధ్య పుష్ప 2 సక్సెస్ అవుతుందా..?

Mega vs Allu War: మెగా vs  అల్లు వార్.. ఇంత నెగెటివిటీ మధ్య పుష్ప 2 సక్సెస్ అవుతుందా..?
Advertisement

Is Pushpa 2 Movie Will Success ? Over Mega vs Allu Issue: పుష్ప-2 డిసెంబర్ 6 గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. అంటే మరో 100 రోజులకు కౌన్ డౌన్ స్టార్ అయింది. ఈ టైంలో పుష్పకు పొలిటికల్ హీట్ తగిలింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ అండ్ టీమ్ కు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది జనసేన నేతల మాస్ వార్నింగ్..

మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వివాదం చిలికిచిలికి గాలివానల మారుతోంది. మనోడైన పగొడే అని మెగా సైడ్ అంటుంటే.. మాకు నచ్చినట్టు ఉంటామప్పా.. అంటున్నారు అల్లు వర్గం.. ఇలా మాటకు మాట మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంతో ఇప్పటికే ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానుల అయితే పరిస్థితి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఫ్యామిలీ మధ్య నడిచిన వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుని సవాళ్లు విసురుకుంటున్నారు.

Advertisement

ఓ వైపు పుష్ప.. తగ్గేదే .. అంటున్నాడు.. కానీ నువ్వు ఎలా తగ్గవో మేము చూస్తాం అంటున్నారు మెగా ఫ్యాన్స్… అసలే డిసెంబర్ 6న పుష్ప-2 సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. దీనిపై చాలా ఎక్స్ పర్టెషన్స్ పెట్టుకున్నారు పుష్ప టీం అండ్ ఫ్యాన్స్.. కానీ మెగా ఫ్యాన్స్ ఫైర్ చూస్తుంటే అసలు సినిమా అడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ పై గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ హీరో అనుకుంటున్నాడు… ఆయనో కమేడియన్ అంటూ ఎద్దేవా చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చి.. వారినే విమర్శించే స్థాయి అల్లు అర్జున్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చూశారుగా క్షమాపణలు చెప్పకుంటే.. పుష్ప2 సినిమాను ఎలా రిలీజ్ చేస్తారో చూస్తామని అన్నారాయన.. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ సైతం పుష్పపై ఫైర్‌ అయ్యారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని.. ఉన్నవారంతా మెగా ఫ్యాన్స్ మాత్రమే అనిఅన్నారు. అంతే కాకుండా ఒక స్టేప్‌ ముందుకేసి అల్లు అర్జున్‌ స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: ఏం పీకలేరు బ్రదర్.. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఫ్యాన్స్

ఇది కేవలం పొలిటికల్ సర్కిల్ లో ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులుగా నుంచి వినిపిస్తున్న సౌండ్.. కానీ పుష్ప అనుకుంటే.. పువ్వనుకుంటివా.. ఫైర్.. నీ అవ్వా తగ్గేదేలే అంటున్నారు ఫ్యాన్స్.. నిజానికి ఎన్నికల ముందు వరకు ఓ లెక్క. ఆ తరువాత లెక్క మారిందా? అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు. కానీ ఎన్నికల తరువాత సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ కొన్నాళ్లుగా రీసౌండ్‌ ఇస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ మధ్య పోరు పాలిటిక్స్‌కు పాకింది. దీంతో ఓ సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్.. తీవ్ర దుమారాన్ని రేపాయి. అల్లు, మెగా కుటుంబాల మధ్య కాంట్రవర్సీగా మారాయి. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి.. నాకు ఇష్టమైతేనే వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా.. అంటూ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక ఇంత అన్నాక మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా.. నీ సినిమా ఎలా ఆడుతుందో మేము చూస్తాం.. అసలు చిరంజీవి లేకపోతే నీ సినిమాలు ఎవరు చూస్తారు అంటూ ఓ లెవల్ లో కౌంటరిస్తున్నారు. మొత్తానికి ఇంత నెగెటివిటీ మధ్యలోనే పుష్ప 2 చిత్రంతో మరో 100 రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు బన్నీ. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప2 సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×