E-Paper
Advertisement

Chiranjeevi: చిరుతో ఉన్న ఈ అక్కాచెల్లెళ్లను గుర్తుపట్టారా.. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీ ?

Chiranjeevi: చిరుతో ఉన్న ఈ అక్కాచెల్లెళ్లను గుర్తుపట్టారా.. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీ ?
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ తీస్తే టాప్ 10 లో జగదేక వీరుడు అతిలోక సుందరి కచ్చితంగా ఉంటుంది. 1990 వరదల్లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగదేక వీరుడుగా చిరు నటిస్తే అతిలోక సుందరిగా శ్రీదేవి కనిపించింది.

ఇక ఈ సినిమాలో ఈ జంట కెమిస్ట్రీ అంతా ఒక ఎత్తు అయితే.. బాల నటులుగా నటించిన వారి నటన మరో ఎత్తు. వారే బేబీ షాలిని, బేబీ షాలిని, రిచర్డ్ రిషి. ముఖ్యంగా బేబీ షామిలి.. రాజు.. రాజు అంటూ ముద్దు ముద్దుగా చిరును పిలుస్తుంటే ఎంతో ముచ్చట వేసింది. ఇక తమను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చే రాజు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు.. ఈ పిల్లలు జై చిరంజీవ.. జగదేక వీర అంతో పాడి.. ఆ హనుమంతున్నే ప్రసన్నం చేసుకున్న తీరు అయితే అద్భుతం. ఈ సినిమాకు చిరంజీవి హీరో అయినా.. ఎన్నో కుటుంబాలు ఈ పిల్లలను చూడడానికే వచ్చాయి అంటే అతిశయోక్తి లేదు.

Advertisement

ఇప్పుడు ఈ పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు.. ? ఎలా ఉన్నారు.. ? అంటే.. అందరూ మీకు తెలిసినవారే. ఈ ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలే అని తెలుసా. అవును బేబీ షాలిని, బేబీ షాలిని, రిచర్డ్ రిషి అన్నా చెల్లెళ్లు. బేబీ షామిలి బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో మంచి సినిమాల్లో నటించింది. బేబీ షామిలినే ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కించారు. అంతలా ఆమె అప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.ఇక షాలిని మాత్రం తక్కువ.. తీసినవి కొన్ని సినిమాలే అయినా ఆమె కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సఖి సినిమా ఇప్పటికీ ఎంతోమంది కుర్రాళ్ల ఫేవరేట్.

రిషి కూడా పలు సినిమాల్లో హీరోగా, సపోర్టివ్ రోల్స్ లో నటించాడు. ఇప్పుడు మాత్రం ఈ ముగ్గురు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. షాలిని.. హీరో అజిత్ ను పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. షాలిని.. అప్పుడెప్పుడో సిద్దార్థ్ సరసన ఓయ్ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తరువాత నాగశౌర్య సరసన అమ్మమ్మగారిల్లు అనే సినిమా చేసింది. ఆ రెండు పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Advertisement

ఇప్పుడు వీరి గురించి ఎందుకు అంటే.. ఈ అన్నాచెల్లెళ్లు .. చిరును కలిసిన ఒక త్రో బ్యాక్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. సినిమాలో శ్రీదేవిని ఫోటో స్టూడియోకు తీసుకెళ్లి ఫోటో తీయిస్తారు కదా.. అలానే ఫోజ్ ఇచ్చి రీయూనియన్ ఫోటో దిగారు. అయితే ఈ ఫొటోలో శ్రీదేవి లేకపోవడంతో..చాలామంది నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×