BigTV English

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న, చిన్న లావాదేవీలు చేసే డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లైట్‌ను ఈ-మాండేట్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విధానంతో యూపీఐ లైట్‌లో ఆటోమెటిక్‌గా క్యాష్ లోడ్ చేసుకునే ఫీచర్‌ను ప్రతిపాదించింది. ఈ విధానంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఫాస్టాగ్‌కు కూడా ఇదే విధానాన్ని ఆర్‌బీఐ సూచించింది.


చెల్లింపులు పెరగనున్నాయా..?

యూపీఐ లైట్ ఓ వ్యాలెట్‌లా పనిచేస్తుంది. ఈ విధానంతో చేసే చెల్లింపులకు పిన్ నంబర్ అవసరం ఉండదు. దీంతో చెల్లింపులు పెరగనున్నాయి. ఇందులో గరిష్టంగా రూ.2వేల వరకు లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కరోజులో రూ.2వేలు మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఒక్క రోజు కూడా గరిష్టంగా రూ.500 మాత్రమే పేమెంట్ చేసేందుకు వీలు ఉండనుంది. యూపీఐకి చెందిన సులభతరమైన వెర్షన్.. ఈ యూపీఐ లైట్. యూపీఐ విధానాన్ని మరింత సౌలభ్యంగా మారుస్తూ యూపీఐ లైట్ వెర్షన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


వ్యాలెట్‌లో బ్యాలెన్స్

ఆర్‌బీఐ తీసుకొస్తున్న ఈ-మాండేట్ విధానంతో యూపీఐ లైట్ మరింత సులభంగా, సౌకర్యవంతంగా పనిచేయనుంది. దీంతో వినయోగం సైతం పెరిగే అవకాశం ఉండనుంది. ఈ-మాండేట్ విధానం కిందకొస్తే.. యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఎప్పటికీ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ తగ్గిన వెంటనే.. ఈ-మాండేట్ విధానంతో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ లోడ్ అవుతోంది. ఇలా అనుకోకుండా యూజర్స్ క్యాష్ లోడ్ చేయడం మరిచిపోయిన సమయంలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా క్యాష్ లోడ్ కానుంది. అయితే లిమిట్ విషయంలో యూజర్స్‌ నిర్ణయంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో బ్యాలెన్స్ తగ్గే అవకాశం ఉండదు.

Also Read: నో ఛేంజ్.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

ప్రయాణికులకు బెస్ట్ ఆప్షన్

యూపీఐ లైట్.. ఈ-మాండేట్ విధానంతో యూజర్స్ ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా డిజిటల్ లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఫాస్టాగ్‌తోపాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటిని ఈ-మాండేట్ విధానంలోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. ఫాస్టాగ్ కార్డులో వ్యాలెట్ క్యాష్ తగ్గితే.. లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా వ్యాలెట్‌లోకి చేరుతుంది. దీంతో ప్రయాణ సమయాల్లో టోల్ గేట్ లావాదేవీల్లో నగదు ఇబ్బందుల సమస్య తలెత్తే అవకాశం ఉండదు.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×