E-Paper
Advertisement

Janhvi kapoor: అక్కడ దిక్కేలేదు.. ఇక్కడ పొగరు చూపిస్తోందా.. ఇలా అయితే కష్టం బేబీ..!

Janhvi kapoor: అక్కడ దిక్కేలేదు.. ఇక్కడ పొగరు చూపిస్తోందా.. ఇలా అయితే కష్టం బేబీ..!
Advertisement

Janhvi kapoor.. జాన్వీ కపూర్ (Janhvi kapoor) .. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కి దివంగత నటీమణి, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi )కూతురు అన్న ఒక ఐడెంటిటీ తప్ప మరేది లేదు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే బాలీవుడ్ లో శ్రీదేవి కూతురుగా అడుగు పెట్టినప్పటికీ తన నటనతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న దాఖలాలు ఏవి లేవు. ముఖ్యంగా శ్రీదేవి చనిపోతూ.. జూనియర్ ఎన్టీఆర్ తో.. తన కూతురు తెలుగులో అడుగుపెడితే.. నీ సినిమాలోనే నటించాలి అని ఎన్టీఆర్ దగ్గర మాట తీసుకుందట. ఆ కోరిక మేరకే శ్రీదేవి కూతురు అన్న ఆలోచనలో భాగంగా జాన్వీ కపూర్ ను తొలిసారి తెలుగు తెరకు పరిచయం చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిజానికి అక్కడ అడపాదడపా సినిమాలలో చేస్తున్న ఈమె.. గ్లామర్ షో తోనే ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది.

బాలీవుడ్ లో పరిస్థితి దిగజారిందా..

Advertisement

ఒకానొక సమయంలో ఇంస్టాగ్రామ్ లో వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న జాన్వీ కపూర్ ను మీడియా మిత్రులు ప్రశ్నించగా .. ఈఎమ్ఐ కట్టడానికి ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తున్నానని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అక్కడ ఈమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈమె ఇప్పుడు టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.. అలా అడుగుపెట్టిందో లేదో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో నటించిన జాన్వి కపూర్ సెప్టెంబర్ 27వ తేదీన అనగా ఈరోజు ఉదయం 1:00 నుంచి షోలు ప్రారంభమయ్యాయి .సినిమా చూసిన వారంతా కూడా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అక్కడ దిక్కేలేదు.. ఇక్కడ పొగరు చూపిస్తున్న జాన్వీ కపూర్..

Advertisement

అయితే ఈ సినిమా ఫలితం జాన్వీ కపూర్ పైన పడినట్టు కనిపించడం లేదు .ఎందుకంటే ఇందులో పల్లెటూరు అమ్మాయిగా కనిపించిన ఈమెను కేవలం నాలుగైదు సన్నివేశాలకే కొరటాల శివ పరిమితం చేశారు. అసలు హీరోయిన్ ఉందా? లేదా? అనే డైలాగ్ లో పడిపోయారు అభిమానులు. అలాంటి ఈమె ఇప్పుడు తదుపరి సినిమాకు పారితోషకం పెంచేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తానేదో మహారాణి అని, దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య అని ఫీల్ అయిపోతుందేమో .. అందుకే ఇలా పొగరు చూపిస్తోంది.. అసలు అక్కడ దిక్కే లేదు కదా ..ఇక్కడ ఎందుకు ఇంత డిమాండ్.. శ్రీదేవి కూతురు కదా అని అవకాశం ఇస్తే.. ఇంత డిమాండ్ చేయడం పద్ధతిగా లేదు అంటూ సినీ ఇండస్ట్రీలో విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నట్లు సమాచారం.

జాన్వీ బాగా బెట్టు చేస్తోందే..?

ఇప్పటివరకు బాలీవుడ్ లో కేవలం ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల పారితోషకం మాత్రమే తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు దేవర సినిమాలో నటించినందుకు గానూ ఏకంగా రూ .5కోట్లు పారితోషకం తీసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా ఫలితం తనపై ఎఫెక్ట్ చూపించకపోయినా రెమ్యునరేషన్ పెంచేస్తోందని సమాచారం. తాజాగా బుచ్చిబాబు – రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ .7కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని , ఈమె డిమాండ్ చూసి తెలుగు నిర్మాతలు కూడా ఆశ్చర్యపోతున్నారని సమాచారం. మొత్తానికైతే బాలీవుడ్ లో దిక్కేలేదు శ్రీదేవి కూతురు అన్న ఒక ఐడెంటిటీ తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి, అప్పుడే ఇక్కడ డిమాండ్ చేసేస్తోంది.. ఇలా అయితే కష్టం బేబీ.. నువ్వు ఇలాగే కొనసాగితే..మరో కృతి శెట్టి లేదా శ్రీ లీల అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×