BigTV English

Samantha: కొత్త జీవితం మొదలు పెడుతోందా.. సామ్ పోస్ట్ వెనుక అర్థం ఏమిటి..?

Samantha: కొత్త జీవితం మొదలు పెడుతోందా.. సామ్ పోస్ట్ వెనుక అర్థం ఏమిటి..?

Samantha.. సమంత (Samantha) ..ఒకప్పుడు స్టార్డం కి పెట్టింది పేరు.. తన అంద చందాలతో, అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతో మందిని మెప్పించిన సమంతకు వైవాహిక జీవితం తర్వాత పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఒకప్పుడు వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశాలు అందుకొని, మంచి ఇమేజ్ అందుకున్న ఈమె నాగచైతన్య (Naga Chaitanya) ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె సినీ కెరియర్ కాస్త బోల్తా పడింది. ముఖ్యంగా ఈమె నటించిన మజిలీ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు.


క్రిస్టియానిటీని వదిలిన సమంత..

దీనికి తోడు చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పటికే ఆ బాధ నుంచి తేరుకోలేక సతమతమవుతోంది. అంతేకాదు వ్యాధిని నయం చేసుకోవడానికి క్రిస్టియానిటీని కూడా వదులుకొని హిందుత్వంలోకి చేరిపోయింది సమంత. గతంలో ఈమె నటించిన శాకుంతలం , యశోద, ఖుషీ.. ఇలా ఏ చిత్రం కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఈమె కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను అంటూ పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు అభిమానులలో కూడా సరికొత్త అనుమానాలను క్రియేట్ చేస్తోంది.


కొత్త జీవితం మొదలు పెట్టనున్న సమంత..

అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ..” అండ్ ఇట్ బిగిన్స్.. లెట్స్ గో..”అంటూ ఒక క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త జీవితం మొదలు పెట్టావా సామ్.. ఆల్ ద బెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ క్యాప్షన్ తను నటించిన సిటాడెల్ – హనీ బన్నీ సిరీస్ కి సంబంధించి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలలో ఈమె కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా భారీగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు, ఈమె డ్రెస్ సెన్స్ అన్ని కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సమంత కెరియర్..

ఇక సమంత విషయానికొస్తే.. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ తమిళ్ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చాలామంది హీరోలతో పని చేసిన సమంత , ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఒకవైపు తెలుగు, తమిళ్ అంటూ సౌత్ భాషలలో ప్రేక్షకులను అలరిస్తున్న సమంత ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఈమె నటించిన తీరుకి బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టబోతోంది సమంత. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకవేళ ఈ సీరీస్ భారీగా సక్సెస్ అందుకుందంటే మాత్రం ఖచ్చితంగా సమంత లైఫ్ టర్న్ అవుతుందనడంలో సందేహం లేదు. అందుకే ఈమె ఇలాంటి క్యాప్షన్ ఇచ్చిందేమో అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×