E-Paper
Advertisement

Ram Charan – Janhvi Kapoor: రామ్ చరణ్‌ జోడీగా జాన్వీ.. జాన్వీ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Ram Charan – Janhvi Kapoor: రామ్ చరణ్‌ జోడీగా జాన్వీ.. జాన్వీ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
Advertisement
Ram Charan - Janhvi Kapoor Movie update

Ram Charan – Janhvi Kapoor movie update(Tollywood news in telugu): మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ సినిమా తర్వాత తాను చేయబోయే ప్రతీ ప్రాజెక్ట్‌పై చరణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాడు. ఇందులో భాగంగానే తన వద్దకు వస్తున్న చాలా సినిమా స్టోరీల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. డిఫరెంట్ స్టోరీ అయితేనే ఓకే చేస్తున్నాడు.

అలాంటి డిఫరెంట్ కథతోనే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది.

Advertisement

ఇందులో రామ్ చరణ్.. తండ్రీ, కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ప్రభుత్వ అధికారి నుంచి సీఎంగా ఎలా ఎదిగాడు.. ఆయన అంత ఎత్తుకు ఎదగడానికి గల కారణాలేంటి అనే అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

READ MORE: RC 16: రామ్ చరణ్ సర్ప్రైజ్ అదిరింది.. మెగా అభిమానులు ఫుల్ ఖుషీ

Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. అలాగే ఈ మూవీలో ఒక్కపాట కోసం దాదాపు రూ.15 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆ మధ్య సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఈ వార్తతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఒక్క పాట కోసమే ఇంత ఖర్చు పెడితే సినిమా కోసం ఇంకెత్త పెట్టారో.. ఇంత ఖర్చు పెట్టినపుడు సినిమా కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని గుస గుసలాడుకుంటున్నారు.

ఇక ఈ మూవీ తర్వాత చరణ్ లైనప్‌లో మరో చిత్రం కూడా ఉంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీలో నటీనటుల కోసం చిత్రబృందం వేట మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఈ సినిమాలో చరణ్‌కు సరిపడా జోడీ కోసం మేకర్స్ తెగ వెతికేస్తున్నారట.

తాజాగా ఆ లిస్ట్‌లో బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ కపూర్‌ పేరు వినిపించింది. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీని తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా మందిని పరిశీలించిన తర్వాత చివరికీ ఈమెనే మేకర్స్ ఫైనల్ చేశారట. అయితే ఈ సినిమాకు గానూ జాన్వీ చాలానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

READ MORE: Ram Charan – Janvi Kapoor: రామ్ చరణ్‌‌తో చిందులేయనున్న ఎన్టీఆర్ భామ..? సౌత్ సినిమాలతో బిజీ అయిన జాన్వీ కపూర్

ఏకంగా రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమచారం. ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రెండవ సినిమాకే ఇంత పెద్ద మొత్తాన్ని తీసుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు.

హిందీలో కేవలం రూ.3.5 కోట్ల పారితోషికం అందుకుంటున్న ఈ భామ.. తెలుగులో మాత్రం డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి అందరినీ ఆశ్చర్యపరచింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×