E-Paper
Advertisement

Jani Master: జానీ మాస్టర్ కి బెయిల్.. సంతోషంలో కుటుంబ సభ్యులు..!

Jani Master: జానీ మాస్టర్ కి బెయిల్.. సంతోషంలో కుటుంబ సభ్యులు..!
Advertisement

Jani Master: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై కేస్ ఫైల్ అవ్వగా ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మైనర్ గా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడన్న కారణంతో పోక్సో చట్టం కింద ఆయనను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా మొన్నా మధ్య జాతీయ అవార్డు ప్రకటించిన తర్వాత అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ కావాలని పిటీషన్ వేయగా.. దాదాపు బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ లైంగిక వేధింపుల కేసులో పట్టుబడడంతో జాతీయ అవార్డుల కమిటీ ప్రతినిధులు జానీ మాస్టర్ కు అవార్డు ఇవ్వకుండా ఆపివేశారు. దీంతో కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాంపల్లి కోర్టులో జానీ మాస్టర్ కు బెయిల్..

Advertisement

జానీ మాస్టర్ గత కొన్ని రోజులుగా చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ బెయిల్ మంజూరు అవ్వడంతో నిజానిజాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మైనర్ లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం..

Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన కొరియోగ్రాఫర్ గా ఇమేజ్ దక్కించుకున్న జానీ మాస్టర్ , ఇదివరకే జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఈయనపై లైంగిక ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా 2017లో జానీ మాస్టర్ తనను అత్యాచారం చేశాడని తెలిపిన బాధిత యువతి , ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు పలు బహిరంగ ప్రదేశాలలో తనపై శారీరక దాడి చేశాడని కూడా తెలిపింది. ప్రస్తుతం తన వయసు 21 సంవత్సరాలు అని చెప్పిన ఈమె, తాను మైనర్ గా ఉన్నప్పుడే తనపై దాడి చేశాడని తెలిపింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జానీ మాస్టర్ ను పోక్ సో చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే చంచల్గూడా జైల్లో ఆయనను రిమాండ్ లో పెట్టారు.

జాతీయ అవార్డు రద్దు..

ఇదిలా ఉండగా కోలీవుడ్ లో ధనుష్ (Dhanush ) హీరోగా నటించిన తిరుచిత్రాంబలం సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి జాతీయ అవార్డు లభించింది. ఈసారి ఈ అవార్డు అందుకోబోతున్న నేపథ్యంలో ఈయన ఇలా జైల్లో ఉన్న కారణంగా బెయిల్ కు అప్లై చేశారు. అసలు విషయం తెలిసిన జాతీయ అవార్డుల కమిటీ ఈయనకు అవార్డును రద్దు చేయడంతో కోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×