BigTV English
Advertisement

Devara : అమ్మ దొంగా… దొరికావ్ కొరటాల… “దేవర”ను ఈ కొరియన్ మూవీ నుంచి లేపేశావ్ కదా?!

Devara : అమ్మ దొంగా… దొరికావ్ కొరటాల… “దేవర”ను ఈ కొరియన్ మూవీ నుంచి లేపేశావ్ కదా?!

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’ (Devara) కలెక్షన్ల ఊచకోత కోసిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో జాన్వి కపూర్ తొలిసారిగా దక్షిణాదికి పరిచయమైంది. అయితే ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి ఎన్టీఆర్ ఖాతాలో సరికొత్త రికార్డులను వేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే కాపీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీని కాపీ కామెంట్స్ వదలట్లేదు. తాజాగా ‘దేవర’ మూవీని కొరటాల ఒక కొరియన్ మూవీ నుంచి లేపేసాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కొరియన్ మూవీ నుంచి కాపీనా?

‘దేవర’ (Devara) సినిమాలో సముద్రంలో స్మగ్లింగ్ జరిగే సన్నివేశం అందరికీ గుర్తునే ఉంటుంది. ఇక ‘స్మగ్లర్’ (Smuggler) అనే ఓ కొరియన్ మూవీ నుంచి దాన్ని కాపీ కొట్టారు అంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ‘స్మగ్లర్’ మూవీ 2023 లో రిలీజ్ అయింది. ఇక ఈ రెండింటినీ కంపేర్ చూస్తే ఎవరికైనా నిజంగానే కొరటాల ఈ సీన్ ను అచ్చు గుద్దినట్టుగా ‘దేవర’ సినిమాలో దింపేశాడు అనిపిస్తుంది. దీంతో ఇలా కాపీ సినిమాకే ఇంత ఓవరాక్షన్ చేశారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొరటాల మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఫైర్ అవుతున్నారు. కానీ నిజానికి ఈ సినిమా కాపీ కాదు అనేది ఎన్టీఆర్ అభిమానుల వెర్షన్.


అసలు విషయం ఏంటంటే?

ప్రస్తుతం ‘దేవర’ (Devara) మూవీని కాపీ కొట్టారు అంటూ వినిపిస్తున్న కొరియన్ మూవీ పేరు ‘స్మగ్లర్’. ఈ ‘స్మగ్లర్’ మూవీ 2023 లోనే థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా నుంచి ‘దేవర’ సీన్లను కాపీ కొట్టారు అనే రూమర్లు వినిపించడానికి కారణం 2024 లో ‘దేవర’ రిలీజ్ కావడం. అంటే ‘దేవర’ కంటే ముందే ‘స్మగ్లర్’ థియేటర్లలోకి వచ్చింది. కాబట్టి రెండు సినిమాలను కంపేర్ చేసి, ఆ మూవీ నుంచి ‘దేవర’ను అచ్చుబుద్దినట్టుగా దింపేశారు అనే రూమర్లు వినిపించాయి. కానీ నిజానికి ‘దేవర’ మూవీని 2021లోనే మొదలుపెట్టారు. అంటే సదరు కొరియన్ మూవీ కంటే ముందే ‘దేవర’ (Devara) స్టోరీ మొదలైంది.

యాదృచ్ఛికంగా ఈ రెండవ సినిమాలలోని సన్నివేశాలు ఒకే రకంగా ఉండడం తో కాపీ కొట్టారని నిందలు కొరటాలపై పడ్డాయి. ఇక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఎన్టీఆర్ అభిమానులు ‘దేవర’ కాపీ కాదు అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కాపీ కొట్టారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై ‘ఎన్టీఆర్’ అభిమానులు ఈ విషయాన్ని చెప్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఏదైతేనేం సినిమా ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకోవటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×