BigTV English

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Jani Master Case.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్.. లైంగిక వేధింపుల కారణంగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కూడా జానీ మాస్టర్ పై కేస్ విధించారు.. అందులో భాగంగానే చంచల్గూడా జైలుకు రెండు వారాలపాటు రిమాండ్ కు తరలించిన పోలీసులు.. రిమాండ్ లో తాను ఆమెపై మోజుపడి 4 సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నానని, ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాను అంటూ నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.


యువతి పై జానీ లైంగిక దాడి.. విష్ణుప్రియకు ముందే తెలుసా..?

ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసులో విష్ణుప్రియ(Vishnu Priya) పేరు సంచలనంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జానీ మాస్టర్ బాధిత యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు విష్ణు ప్రియకు ముందే తెలుసట. వాస్తవానికి విష్ణు ప్రియ, బిగ్ బాస్ మానస్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో ఒక రేంజ్ లో పాపులర్ అయిన తెలిసిందే. ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి బాధిత యువతి కొరియోగ్రఫీ అందించారు. ఇదిలా ఉండగా జానీ లేడీ కొరియోగ్రాఫర్ పై కన్ను వేసిన విషయం విష్ణుప్రియకు తెలిసినా కూడా ఆమె నోరు మెదపలేదని తెలుస్తోంది.


బిగ్ బాస్ కి పోలీస్ నోటీసులు..

Jani Master Case: Vishnupriya out of Bigg Boss house... Her link with Jani case is this..
Jani Master Case: Vishnupriya out of Bigg Boss house… Her link with Jani case is this..

ఇదిలా ఉండగా మరొకవైపు.. విష్ణు ప్రియ కారణంగా ఇప్పుడు బిగ్ బాస్ (Bigg Boss) కి పోలీస్ నోటీసులు పంపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈమె కోసమే బిగ్ బాస్ హౌస్ కి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు అని సమాచారం. ఇక ఈ కారణంగా రేపు వారంలో హౌస్ నుంచి విష్ణుప్రియ ఎప్పుడైనా అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమెను బిగ్ బాస్ హౌస్ నుంచి పోలీసులు తీసుకెళ్లి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ కి పంపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ – బాధిత యువతి కేసులో ఎంక్వయిరీ చేయడం కోసం విష్ణుప్రియను కూడా పిలిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రియ ను రేపు వారం ఎప్పుడైనా సరే బయటికి పంపించే అవకాశాలున్నట్లు సమాచారం

చంచల్గూడా జైలుకు వెళ్లిన జానీ మాస్టర్..

ఇకపోతే జానీ మాస్టర్ పై బాధిత యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 15వ తేదీన పోలీస్ కంప్లైంట్ చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని, బహిరంగ ప్రదేశాలలో అసభ్యకరంగా తాకుతూ, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని హింసిస్తున్నాడు అంటూ కంప్లైంట్ చేసింది. అంతే కాదు తనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, తన భర్త చెప్పినట్టు వినకపోతే తనకు అవకాశాలు రాకుండా చేస్తామని ,ఆయన భార్య కూడా బెదిరించినట్లు బాధిత యువతి చెప్పుకొచ్చింది. దీంతో ఎఫ్ఐఆర్ కేస్ ఫైల్ చేసిన పోలీసులు జానీ మాస్టర్ ను చంచల్గూడా జైలుకు పంపించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×