BigTV English

Man Dies Eating Idli: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..

Man Dies Eating Idli: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..

Man Dies By Eating Idli During Onam| చాలాసార్లు మనమంతా వింటూ ఉంటాం. భోజనం చేసే సమయంలో ప్రశాంతంగా తినాలి. నెమ్మదిగా ఆహారం నమిలి తినాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. త్వర త్వరగా భోజనం తింటే ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు కూడా అదే చెబుతూ ఉంటారు. అలా చాలా స్పీడుగా భోజనం తినబోయి ఒక వ్యక్తి తన ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తాజగా జరిగింది. అయితే ఈ విషాదం పండుగ వేళ జరగడం మరింత బాధాకరం.


ఇటీవల సోషల్ మీడియాలో త్వరగా ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ కామెంట్లు రావాలి.. తొందరగా సబ్స్‌క్రైబర్ల సంఖ్య వేలు, లక్షల్లో చేరుకోవాలని యూట్యూబర్లు వింత వీడియోలు చేస్తుంటారు. అలాంటి ఒక పోటీ ఇటీవల కేరళలో ఓనమ్ పండుగ రోజు జరిగింది. కేరళ రాష్ట్రం పలక్కడ్ జిల్లా కోజికోడ్ ప్రాంతంలోని ఒక లోకల్ క్లబ్ లో గత శనివారం ఒక ఫాస్టెస్ట్ ఇడ్లీ ఈటింగ్ పోటీ నిర్వహించారు.

Also Read: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!


ఆ ఇడ్లీ తినే పోటీలో నలుగురు పాల్గొన్నారు. వారిలో సురేష్ అనే ఓ 49 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ కాంపిటీషన్ చూసేందుకు 60 మంది వచ్చారు. అయితే ఆ ఇడ్లీ పోటీ అంత ఈజీ కాదండోయ్. ఇడ్లీ మాత్రమే తినాలి. చట్నీ, సాంబార్, కర్రీ లాంటివి ఏమీ ఉండవు. పోటీ ప్రారంభం కాగానే మిగతా ముగ్గురు కాంటెస్టెంట్లు ఒక్కో ఇడ్లీని నోట్లో పెట్టుకున్నారు. కానీ సురేశ్ మాత్రం అందరి దృష్టి ఆకర్షించాలని సాహసం చేశాడు.

ఈ పోటీలో సురేశ్ త్వర త్వరగా ఇడ్లీలు తినాలని ఒకేసారి మూడు ఇడ్లీలు తిన్నాడు. అది కూడా సరిగా నమలకుండా పూర్తి ఇడ్లీని మింగాలని ప్రయత్నించాడు. అయితే తిన్న ఒక నిమిషంలోపే అతను ఊపిరి బిగబట్టుకుని కింద పడిపోయాడు. అది చూసి పక్కన ఉన్న కొంతమంది అతన్ని కాపాడాలని ప్రయత్నించడానికి అతని నోట్లో నుంచి ఇడ్లీని బయటికి తీపించారు. ఆ తరువాత కూడ అతనికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కాసేపు తరువాత సురేష్ మరణించాడు.

కోజికోడ్ లోని వలయర్ నియోజికవర్గంలో పుదుస్సెరి గ్రామ పంచాయితీలో సురేష్ నివసించేవాడు. ఆ పరిసరాల్లోనే నివసించే గిరీష్.. సురేష్ కు స్నేహితుడు. సురేష్ ఒక లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని అతను తన తల్లి వద్ద ఉండేవాడని తెలిపాడు. ఓనం పండుగ సందర్భంగా తమ ప్రాంతంలో చాలా పోటీలు నిర్వహిస్తుంటారని సురేష్ చాలా చురుకుగా ఉంటూ పోటీల్లో పాల్గొనే వాడని చెప్పాడు. పండుగ వేళ సురేష్ మరణంతో అతని ఇరుగుపొరుగు వారు చాలా బాధలో ఉన్నారు.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

ఇంతకుముందు కూడా ఇలాగే ఒక వ్యక్తి ఆరోగ్యానికి మంచిదని వీడియో చేస్తూ.. ఒక పెద్ద స్పూన్ ఫుల్ చియా సీడ్స్ తినేసి.. నిండుగా నీళ్లు తాగాడు. అంతే కాసేపట్లోనే ఊపిరాడకుండా చనిపోయాడు. అందుకే చియా గింజలు కనీసం 20 నుంచి 30 నిమిషాలు నీటిలో నానబెట్టి ఆ తరువాత తినాలి. అప్పుడే అవి శరీరంలో సరిగా జీర్ణమవుతాయి.

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×