E-Paper
Advertisement

Jani Master: మాస్టర్ కు మధ్యంతర బెయిల్.. అందుకేనా..?

Jani Master: మాస్టర్ కు మధ్యంతర బెయిల్.. అందుకేనా..?
Advertisement

Jani Master: లైంగిక వేధింపుల కేసులో గత రెండు వారాలుగా చంచల్ గూడా జైల్లో రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కి తాజాగా మధ్యంతర బెయిల్ లభించినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకెళితే లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయి జైల్లో ఖైదీగా ఉన్న ఈయనకు బెయిల్ కావాలని కోరుతూ.. కోర్టులో పిటిషన్ వేయగా గురువారం ఈ బెయిల్ పిటిషన్ పై విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈనెల అనగా అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 10 వ తేదీ వరకు ఐదు రోజులపాటు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు.

అందుకే మధ్యంతర బెయిల్..

Advertisement

ఇకపోతే జానీ మాస్టర్ కు ఇలా మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కారణం.. జానీ మాస్టర్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఇటీవల జాతీయ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్టోబర్లో జరగనున్న అవార్డుల ప్రధానోత్సవానికి హాజరై పురస్కారం అందుకోవడం కోసమే జానీ మాస్టర్ కు ఇలా బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు..

Advertisement

తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ భాషలలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న జానీ మాస్టర్ కు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు ప్రకటించారు.. తమిళ్లో ధనుష్ హీరోగా తెరకెక్కిన తిరుచిత్రంబళం సినిమాలో మేఘం కరుకత పాటకి బెస్ట్ డాన్స్ కొరియోగ్రఫీ అవార్డు ప్రకటించారు. అయితే ఈ పాటను జానీ మాస్టర్ తో పాటు సతీష్ కృష్ణన్ కూడా కంపోజ్ చేయగా.. వీరిద్దరికి అవార్డు లభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులో తిరు పేరిట రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ” మేఘం కరిగేనే పిల్లో పిల్లై” అంటూ తెలుగులో కూడా ఈ పాట పెద్ద హిట్ అయింది. ఈ సాంగ్లో చీకట్లో సింపుల్ లైట్ తో సింపుల్ స్టెప్స్ తో చాలా అందంగా చిత్రీకరించారు.. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా మారి చాలామంది రీల్స్ కూడా చేశారు . అప్పట్లో బాగా ట్రెండ్ కూడా అయింది. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవం ఈ నెలలో జరగబోతున్న నేపథ్యంలో అవార్డు అందుకోవడం కోసమే మధ్యంతర బెయిల్ ప్రకటించారు. ఇక 67వ నేషనల్ అవార్డుల్లో కూడా కన్నడ సినిమా యువరత్న లోని ఒక పాటకి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు.

చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్..

ఇకపోతే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డులు అందుకున్న జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు నిజంగా ఆయన పరువును తీయడానికే అంటూ కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అసలు విషయంలోకి వెళితే 2017లో మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేసినట్లు బాధిత యువతి తాజాగా పోలీసుల ముందు తన బాధను వెల్లబుచ్చుకుంది.. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్టు చేసి చంచల్గూడా జైల్లో పెట్టారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×