E-Paper
Advertisement

Ram Gopal Varma: కొండా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పడమేంటి? ఆర్జీవీ కాంట్రవర్షియల్ ట్వీట్

Ram Gopal Varma: కొండా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పడమేంటి? ఆర్జీవీ కాంట్రవర్షియల్ ట్వీట్
Advertisement

Ram Gopal Varma: అక్కినేని ఫ్యామిలీపై.. ముఖ్యంగా నాగార్జునపై ఘోరమైన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ. కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగచైతన్య, సమంత విడాకుల గురించి మాత్రమే కాకుండా నాగార్జున గురించి కూడా ప్రస్తావించారు. దీంతో నాగార్జునకు, తన ఫ్యామిలీకి సపోర్ట్‌గా సినీ పరిశ్రమ అంతా ఒక్కటయ్యింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఒప్పుకోమని, ఖండిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. అంతే కాకుండా నాగార్జునకు, తన ఫ్యామిలీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై తన స్టైల్‌లో స్పందించారు. అయినా అసలు కొండా సురేఖ.. సమంతకు క్షమాపణలు చెప్పడమేంటి అంటూ ట్వీట్ చేశారు.

గుణపాఠం నేర్పించాలి

Advertisement

‘కొండా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పడమేంటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగచైతన్యని. వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది అని చెప్పడంకంటే ఘోరమైన అవమానం నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయ్యింది? వాళ్లిద్దరి కోసమే కాకుండా సినీ పరిశ్రమలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగచైతన్య చాలా సీరియస్‌గా తీసుకొని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

Also Read: ప్రతీసారి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు.. కొండా సురేఖపై మెగా ఫ్యామిలీ ఫైర్

Advertisement

అందరూ ఖండించారు

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్‌లో నాగచైతన్య, నాగార్జునను కూడా ట్యాగ్ చేశారు. ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య ఈ విషయంపై స్పందించారు. ముందుగా కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు నాగార్జున వరకు వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా దీని గురించి మాట్లాడారు. తన కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని వాటిని ఖండించారు. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్‌గా ముందుకొచ్చారు. నాగార్జున అలా చేయరు అంటూ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో కొండా సురేఖ కూడా తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం మాత్రమే కాకుండా సమంతకు క్షమాపణ చెప్పారు.

ఆర్జీవీకే సపోర్ట్

సమంతకు క్షమాపణ చెప్పడం అనవసరం అని, నాగార్జున, నాగచైతన్యకు క్షమాపణ చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక మామగా నాగార్జునపై, ఒక భర్తపై నాగచైతన్యపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి వారే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. అసలైతే కొండా సురేఖ వారికి క్షమాపణలు చెప్పాలని ఆర్జీవీ చెప్పిన మాటలకు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. సమంతకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాత ఈ విషయంపై కొండా సురేఖ స్పందించలేదు. కానీ నాగార్జున మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అమల సైతం కాంగ్రెస్‌లో ఇలాంటి లీడర్లు ఉండడం కరెక్టా కాదా ఆలోచించుకోమంటూ రాహుల్ గాంధీకే రిక్వెస్ట్ పెట్టుకున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×