BigTV English

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Jani Master.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై లైంగిక ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. తాజాగా వెలువడుతున్న ఒక్కొక్క వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2017 లో జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్లు, బహిరంగంగా తనను అసభ్యకరంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్ లో కూడా చాలాసార్లు లైంగిక దాడి చేశాడని , ముఖ్యంగా ముంబై హోటల్లో బస చేసినప్పుడు తనపై అత్యాచారం చేసి బెదిరించాడంటూ బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం తన వయసు 21 సంవత్సరాలు అని చెప్పిన ఆమె, తనను మైనర్ గా ఉన్నప్పటినుంచే అత్యాచారం చేశాడని తెలిపింది.


చంచల్ గూడా జైలుకు జానీ..

దీంతో పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు చేయడమే కాకుండా పోక్సో చట్టం కింద కూడా కేసు ఫైల్ చేశారు. కేస్ ఫైల్ అవ్వడంతో తప్పించుకొని తిరిగిన జానీ మాస్టర్ ను గోవాలో ఉన్నాడని తెలుసుకొని అరెస్టు చేసిన పోలీసులు, శుక్రవారం రోజున ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. అయితే కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే కుట్రపూరితంగా తనను ఇరికించారని , కడిగిన ముత్యములా, నిజాయితీగా బయటకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఎవరిని కూడా వదిలిపెట్టనని ,అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జానీ మాస్టర్ ను మీడియా అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా.. 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధిస్తూ.. చంచల్ గూడా జైలుకు తరలించారు


ఆరోపణలు నిజమే అంటూ నేరం ఒప్పుకున్న జానీ మాస్టర్..

Jani Master: Yes.. I did wrong.. Jani confessed to the crime before the police..!
Jani Master: Yes.. I did wrong.. Jani confessed to the crime before the police..!

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తనపై వస్తున్న ఆరోపణలు నిజమే అంటూ ఎట్టకేలకు ఒప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారుజానీ మాస్టర్. అత్యాచార ఆరోపణలతో చంచల్గూడా జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్.. తాజాగా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను చెప్పినట్లు రిపోర్టులో పోలీసులు పొందుపరిచారు. 2019లో దురుద్దేశంతోనే బాధితురాలని అసిస్టెంట్ గా చేర్చుకున్నాను. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై అత్యాచారం చేశాను. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. గత నాలుగు సంవత్సరాలుగా ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాను. విషయం బయటకు తెలిస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాను. నా భార్య కూడా బెదిరింపులకు దిగింది అంటూ చెబుతూ..నేరాన్ని స్వయంగా జానీ అంగీకరించారు అంటూ పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. ఇకపోతే జానీ నేరం అంగీకరించినట్లు పోలీసులు తమ రిపోర్టులో వెల్లడించగా ఈ విషయం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

సపోర్టుగా నిలిచిన వారికి షాక్..

ఇదిలా ఉండగా మరోవైపు జానీ మాస్టర్ అలాంటివాడు కాదని, ఆయన వ్యక్తిత్వం మంచిది అని , ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది ఆయనపై ఇలాంటి కుట్ర పన్నారు అంటూ చాలామంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ కు అండగా నిలిచారు. ముఖ్యంగా ఆయన భార్య నిజం నిరూపణ అయితే భర్తను విడిచి వెళ్లిపోతానని కూడా తెలిపింది.. దీనికి తోడు ఆట సందీప్ మాస్టర్ భార్య జ్యోతితో పాటు ప్రముఖ డాన్సర్ రాము అలాగే సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ కు అండగా నిలిచారు. నాగబాబు కూడా నేర నిరూపణ అయ్యేవరకు ఎవరిని నిందితులుగా చేర్చకూడదు అంటూ ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేసి జానీ మాస్టర్ కు మద్దతు పలికాడు. మరి జానీ మాస్టర్ నేరం ఒప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×