Jani Master : లైంగిక వేధింపుల కేసుపై తాజాగా అరెస్ట్ అయిన జానీ మాస్టర్ (Jani Master). రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారారు. ఎంతో మంది స్టార్ హీరోలతో, హీరోయిన్లతో పనిచేసిన ఈయన ఇప్పుడు ఒక అమ్మాయిని లైంగికంగా హింసించాడనే ఆరోపణలు రావడంతో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేసిన పోలీసులు, ఏకంగా ఆయనను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు,సెలబ్రెటీలు, హీరోల నుంచి జానీ మాస్టర్ కు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఊహించని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
జానీ మాస్టర్ కు అండగా లేడీ కొరియోగ్రాఫర్..
రెండు తెలుగు రాష్ట్రాలలో అటు సెలెబ్రిటీల నుండి ఇటు ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తొలిసారి జానీ మాస్టర్ కు అండగా నిలిచారు లేడీ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ (Swarna Master). తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సరైన రీతిలో విచారణ నిర్వహిస్తే నిజాలు బయటపడతాయని.. జానీ మాస్టర్ తప్పు చేశారంటే నమ్మడం కష్టంగా ఉంది అంటూ జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచింది స్వర్ణ మాస్టర్. స్వర్ణ మాస్టర్ మాట్లాడుతూ.. అటు జానీ మాస్టర్ ఇటు బాధిత లేడీ డాన్సర్ తో నాకు ఎటువంటి పరిచయం లేదు. కానీ పలు పలు కథనాలలో వెలువడుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే.. జనరల్ గా నాకు ఒక ఆలోచన తట్టింది అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది.
ఏదైనా ఆశించి జానీ మాస్టర్ తో రిలేషన్ పెట్టుకుందేమో..
ఆ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర చాలా సంవత్సరాల పాటు పనిచేసింది కదా.. జానీ మాస్టర్ తప్పుగా ప్రవర్తించి ఉంటే అప్పుడే ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా.. కానీ ఆయన దగ్గర పని మానేసిన సంవత్సరం తర్వాత ఎందుకు సడన్గా కంప్లైంట్ చేసింది. అసలు మన అనుమతి లేకుండా ఎవరు కూడా మన ఒంటి మీద చేయి కూడా వేయరు. ఒకవేళ అలా చేయి వేస్తే మనం గట్టిగా అరిచి సమాధానం చెప్పవచ్చు. ఆ సమయంలో జానీ మాస్టర్ ఆమెపై లైంగిక దాడి చేసినప్పుడు ఎందుకు అరవలేదు. అప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు..మనం చెడిపోవాలన్నా.. బాగుపడాలన్నా సరే మన చేతుల్లోనే ఉంటుంది. అన్ని సంవత్సరాల నుంచీ జానీ మాస్టర్ వేధిస్తున్నాడని చెబుతున్న ఈమె అప్పుడు ఎందుకు చెప్పలేదు. అతడితో ఏదైనా ఆశించి రాజీ పడిందేమో.. నాకెందుకో జానీ మాస్టర్ మీద కావాలనే కుట్ర పన్ని ఇలా చేస్తున్నారేమో అనిపిస్తోంది.. పైగా జాతీయ అవార్డు అందుకున్నాడన్న అసూయతో కూడా జీర్ణించుకోలేక ఈయనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో.. దీని వెనుక ఎవరైనా వ్యక్తి ఉండి ఇలా నడిపిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది..ఆయన ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లతో పనిచేశారు కదా. ఆయన చూడని అమ్మాయిలు ఉంటారా.. అలాంటిది ప్రత్యేకంగా ఆ అమ్మాయినే ఆయన ఎందుకు లైంగిక వేధింపులకు గురిచేస్తాడు అనే విషయం నమ్మశక్యంగా లేదు.. కూపీ లాగితే డొంక కదిలినట్టు..ఎంక్వయిరీ కరెక్ట్ గా జరిగితే మాత్రం అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటూ స్వర్ణ మాస్టర్ తెలిపింది. మొత్తానికి అయితే స్వర్ణ మాస్టర్ చేసిన కామెంట్లు కాస్త ఆలోచించే విధంగా ఉన్నాయని జానీ మాస్టర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
స్వర్ణ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన చిత్రాలు..
ఇక స్వర్ణ మాస్టర్ విషయానికి వస్తే.. లేడీ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. బావ బామ్మర్ది, సోగ్గాడి పెళ్ళాం , ధర్మచక్రం , అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోవిందుడు అందరివాడేలే, మనసిచ్చి చూడు, వేదం, యమదొంగ, రాజన్న, గౌతమి పుత్ర శాతకర్ణి, ఆర్ఎక్స్ 100 ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలోని పాటలకు ఈమె కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఇతర భాషల్లో పనిచేస్తున్న ఈమె ఇలాంటి వార్తలు రావడంతో ఆయనకు అండగా నిలుస్తూ అసలు నిజాన్ని బయటకు రప్పించాలంటూ పోలీసులను కోరింది. ప్రస్తుతం స్వర్ణ మాస్టర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.