BigTV English
Advertisement

Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతిని ఎదురించిన మీనా.. అడ్డంగా దొరికిన రోహిణి.. శృతి పెళ్లి డేట్ ఫిక్స్..

Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతిని ఎదురించిన మీనా.. అడ్డంగా దొరికిన రోహిణి.. శృతి పెళ్లి డేట్ ఫిక్స్..

Gundeninda Gudigantalu Today Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో గుండెనిండా గుడిగంటకు సీరియల్ ఒకటి.. మధ్య తరగతి జీవితాల గురించి చక్కగా చూపించారు.. ఈ సీరియల్ ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ఈరోజు ఎపిసోడ్లోని హైలైట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


గొప్పింటి పెళ్లి సంబంధంను బాలు కావాలనే చెడగొట్టాడని ప్రభావతి ఫైర్ అవుతుంది. పెళ్లి సంబంధం చెడిపోవాలనే పని మానుకొని ఇంట్లో ఉన్నావా అంటూ బాలును నిలదీస్తుంది. అప్పుడు సత్యం నువ్వు పేర్చిన అబద్దాల అద్దాల గోడ కూలిపోయిందని అందరి మీద అరుస్తున్నావా అని మండిపడతాడు. నీ అబద్దాల వల్ల ఎన్నో అనర్థాలు జరిగాయని, మళ్లీ మొదలుపెట్టావా అంటూ భార్యను నిలదీస్తాడు సత్యం. మమ్మల్ని ఈ మాత్రం కూడా బ్రతకనివ్వవా అంటూ కోపంతో మండిపడతాడు.. ఇక ప్రభావతి మాత్రం మీతో కాపురం చేసిన 30 ఏళ్లలో ఎన్ని రత్నాలు, వజ్రాలు కొనిచ్చారు అంటూ సత్యంపై సెటైర్లు వేస్తుంది ప్రభావతి. మీరు ఎదగరు..పిల్లలను ఎదగనివ్వరు అంటూ భర్తను తక్కువచేస్తూ మాట్లాడుతుంది. మోసాలు చేసి పెళ్లిల్లు చేస్తే కాపురాలు సవ్యంగా సాగవని తల్లికి బాలు సలహా ఇస్తాడు.. అది సహించలేకపోతుంది ప్రభావతి..

ఇక మీనా గురించి ప్రభావతి తక్కువ చేసి మాట్లాడుతుంది.. ఇక మీనా కుటుంబం బెదిరించి ఆమెను మనకు అంటగట్టారని ఎలా మాట్లాడావని భార్యను అడుగుతాడు సత్యం. రవి, మౌనిక కూడా తమకు సంబంధం నచ్చలేదని అంటారు. ఇక పెళ్లి కోసం ప్రభావతి మాత్రం అబద్దాల మీద అబద్దాలు చెబుతుంది. పెళ్లికొడుకు తినడానికే పుట్టినట్లున్నాడని, సంబంధం ఓకే అయినా వాడిని తాను పెళ్లిచేసుకునేదానికి కాదని మౌనిక తెగేసి చెప్పేసింది. పెళ్లి చెడగొట్టి బాలు మంచి పనిచేశాడని రవి, మౌనిక అంటారు. అందరూ ప్రభావతిపై మాటల దాడి చేయడంతో సెలైంట్ అయిపోతుంది. ఇక గొప్పింటి సంబంధం చెడి పోయినందకు మనోజ్ లోపల సంతోష పడతాడు.


ఆ తర్వాత బాలు నాన్నను గౌరవించని కుటుంబంతో పెళ్లి సంబంధం పెట్టుకోవడం అవసరం లేదని బాలు తెగేసి చెప్పేస్తాడు. బాలును ఇంట్లో ఉండేలా చేసి పెళ్లి సంబంధం చెడిపోవడానికి మీనానే కారణమని ప్రభావతి లోలోన రగిలిపోతుంది. కావాలనే నువ్వు ఇదంతా చేశావు కదా అని మీనాపై నిందలు వేస్తుంది. ఇక బాలు ఒక దరిద్రుడు.. అందుకే వాడికి ఇలా జరిగింది. అని ప్రభావతి అనడంతో మీనా అత్తయ్య నా ముందే నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను అని కోపంతో రగిలిపోతుంది..

మీ కళ్ల ముందే మీ భర్తను అన్ని మాటలు అన్నవాళ్లపై కోపం రాకుండా ఇంకా వాళ్లనే వెనకేసుకొని వస్తున్నారా అంటూ అత్తకు క్లాస్ ఇస్తుంది మీనా. ఇన్నాళ్లు మీపై గౌరవం ఉంటేది…ఇవాళ అది కూడా పోయిందని ప్రభావతితో అంటుంది మీనా.. ఇక తన భర్తకు జరిగిన అన్యాయాన్ని గుర్తించదు ప్రభావతి.. మరోవైపు శృతి పెళ్లి ఫిక్స్ అవుతుంది. నీలకంఠం కొడుకు సంజుతో శృతి పెళ్లిని ఇరు కుటుంబాల వారు ఫిక్స్ చేస్తారు. శృతిని తాను ఉండమంటే ఉండలేదని, తనకు ఎవరైనా ఎదురుచెప్పడం నచ్చదని సంజు అంటాడు. పెళ్లికి ముందే శృతి ఎవరినైనా ప్రేమించిందేమోనని సంజు అనుమానపడతాడు. ఇక ప్రేమ విషయాన్ని దాచి పెట్టి పెళ్లిని ఫిక్స్ చేస్తారు.

Gundeninda Gudigantalu Today Episode
Gundeninda Gudigantalu Today Episode

ఇక రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది.. బ్యూటీ పార్లర్‌పై ఉన్న ప్రభావతి పేరును తీసేయడంతో రోహిణి ఎమోషనల్ అవుతుంది. ఈ నిజం అత్తయ్యకు తెలిస్తే తనపై ఉన్న నమ్మకం మొత్తం పోతుందని భయపడుతుంది. తాను పెట్టిన పార్లర్‌లో తానే ఎంప్లాయ్‌గా మారడం జీర్ణించుకోలేకపోతుంది. అమ్మ వల్ల తన గురించి నిజం ఎక్కడ బయటపడుతుందోనని కంగారు పడుతుంది. నిజం బయటపడకుండా ఉండాలంటే వెంటనే అమ్మను ఊరి నుంచి పంపించాలని అనుకుంటుంది.. క్వీన్ బ్యూటీ పార్లర్ అనే పేరు చూస్తే తన నాటకం మొత్తం బయటపడుతుందని కంగారుగా నేమ్ బోర్డ్‌పై క్లాత్ కప్పేస్తుంది.. ఇక రవిని ప్రేమిస్తున్న విషయాన్ని శృతి మీనాకు చెబుతుంది. రవిని లేవదీసుకుపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇక వెళ్తున్న శృతిని ప్రభావతి, రోహిణి చూస్తారు. అక్కడితోఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Big TV Kissik talks: సూసైడ్ చేసుకోవాలనుకున్న విష్ణు ప్రియ.. బయట పెట్టిన నిజం!

Big TV Kissik talks: సన్యాసం తీసుకుంటానంటున్న విష్ణు ప్రియ.. ఇదెక్కడ ట్విస్ట్ మావా?

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. శ్రీవల్లి ఐడియాతో ఇరుక్కున్న టీమ్..రౌడీలను చితక్కోట్టిన ఆడాళ్ళు..

Intinti Ramayanam Today Episode: అవనిని ఘోరంగా అవమానించిన పల్లవి.. పార్వతి మాటతో అవని హ్యాపీ.. చక్రధర్ కు కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాను గుద్దేసిన ప్రభావతి.. బాలును ఇరికించేసిన మీనా.. మనోజ్ కు దిమ్మతిరిగే షాక్..

Brahmamudi Serial Today October 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్‌ కు బుద్ది చెప్పేందుకు కావ్య, రాజ్‌ నాటకం  

Nindu Noorella Saavasam Serial Today october 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ల్యాబ్ రిపోర్ట్ చూసి షాక్ అయిన రాథోడ్

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Big Stories

×