BigTV English

Joni Master : మాస్టారు క్రిమినల్ హిస్టరీ… నెలలపాటు జైల్లోనే…

Joni Master : మాస్టారు క్రిమినల్ హిస్టరీ… నెలలపాటు జైల్లోనే…

Johnny Master : టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు. తనను లైంగిక వేధిస్తున్నారంటూ పోలీసులకు జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. జానీ మాస్టర్ పై రేప్ కేసు తో పాటుగా పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలానాలకు కేరాఫ్ గా మారింది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్.. లైంగిక దాడి చేస్తున్నారంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ కేసు విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. గతంలో జానీ మాస్టర్ పై ఉన్న కేసులు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


జానీ మాస్టర్ పై మహిళా డ్యాన్సర్ కేసు..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ మహిళా డ్యాన్సర్ రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచి తనపై జానీ వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యారని.. ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. ఔట్‌ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక సార్లు లైంగిక దాడికి యత్నించాడని ఫిర్యాదు పేర్కొన్నారు. నిన్న బాధిత మహిళా స్టేట్మెంట్ తో ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయ్యింది.. అతనితో పాటుగా ఆయన భార్య కూడా వేధింపులకు గురి చేసినట్లు చెప్పింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

జానీ మాస్టర్ క్రిమినల్ హిస్టరీ..

Johnny Master Criminal History .. Jail Sentence Details
Johnny Master Criminal History .. Jail Sentence Details

జానీ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పుల కన్నా ఆయన క్రిమినల్ హిస్టరీ పెద్దగానే ఉందని పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు.. 2017లో ఒక కాలేజీ మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఆ కేసు పూర్తివ్వగానే మరో రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ని ఉన్నా ఆయన మళ్లీ అదే పని చెయ్యడం పై జనాలు మండిపడుతున్నారు. ఇక మహిళా సంఘాలు కూడా ఈ కేసు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈ పిర్యాదు నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇటు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సైతం దీనిని సీరియస్ గా తీసుకుంది. అసోసియేషన్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొరియోగ్రాఫర్స్‌ అత్యవసర సమావేశం జరగనుంది. ఇక తాజాగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మాస్టర్ హైదరాబాద్ లో ఉన్నాడా లేదా ఏదైన దేశానికీ చెక్కెశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు నిజా నిజాలు తెలియాలంటే మాస్టర్ నోరు విప్పేవరకు వెయిట్ చెయ్యాలి..

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×