BigTV English

Bigg Boss 8: మూడోవారం నామినేషన్స్ లిస్ట్.. కొంప ముంచారు కదరా..?

Bigg Boss 8: మూడోవారం నామినేషన్స్ లిస్ట్.. కొంప ముంచారు కదరా..?

Bigg Boss 8.. బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss) ఇప్పుడు 8వ సీజన్ కి చేరుకుంది. అందులో అప్పుడే మూడవ వారానికి వచ్చేసింది ఈ సీజన్. ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ అంటూ సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ లో.. అప్పుడే మొదటి వారంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, రెండవ వారం ఆర్జె శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం ఎలిమినేషన్స్ కి సంబంధించి నామినేషన్స్ రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే.


చెత్త రీజన్స్ తో నామినేట్ అయిన కంటెస్టెంట్స్..

ముఖ్యంగా కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు చెత్త వేసుకుంటూ చెత్త రీజన్స్ తో నామినేట్ చేశారు. ముఖ్యంగా మూడో వారం నామినేషన్స్ లో భాగంగా మణికంఠ – యష్మీ మధ్య హీటెక్కించే డిస్కషన్ నడిచింది అని చెప్పవచ్చు. యష్మీ.. విష్ణును నామినేట్ చేస్తూ గుడ్లు తినేశావంటూ వింత రీసన్ చెప్పింది. ఆ తర్వాత నాగ మణికంఠను టార్గెట్ చేస్తూ.. అతనిపై రివేంజ్ తీర్చుకుంది. నేను ఫ్రెండ్షిప్ కి విలువ ఇస్తాను. నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావు. నువ్వు నన్ను మోసం చేశావు. ఇక ఈ హౌస్ కి నువ్వు చాలా డేంజర్. హౌస్ లో నేను ఎన్ని వారాలు ఉంటానో.. అన్ని వారాలు నేను నిన్ను నామినేట్ చేస్తాను అంటూ మణికంఠను నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆదిత్య ఓం.. విష్ణు ప్రియ, మణికంఠలను నామినేట్ చేయగా, నైనిక.. సోనియా, ప్రేరణలను నామినేట్ చేసింది.

సోనియా – యష్మీ మధ్య చిన్నపాటి యుద్ధం..

నబీల్, ప్రేరణ మధ్య ఒక రేంజ్ డిస్కషన్ జరగగా, ఆ తర్వాత యష్మిని నామినేట్ చేశాడు నబీల్ . పృథ్వి.. సీత, నైనిక లను నామినేట్ చేయగా, నైనిక చీఫ్ గా ఫెయిల్ అయ్యావ్ అంటూ నైనిక ను నామినేట్ చేసింది సోనియా. ఆ తర్వాత యష్మీ ని నామినేట్ చేస్తూ.. నువ్వు పాజిటివ్ గా ఉంటే బాగుండు. కానీ ఎప్పుడూ నెగిటివ్ గా చేస్తావు కదా.. నీతో పాటు ఈ హౌస్ కూడా ఇప్పుడు నెగిటివ్ గా మారిపోయింది అంటూ సోనియా తెలిపింది. ఇక తర్వాత సోనియా – యష్మీ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఇక చివరిగా ఇద్దరు చీఫ్ లో ఒకరు నేరుగా నామినేట్ కావాలని బిగ్ బాస్ చెప్పగా, అభయ్ చివరికి నామినేట్ అయ్యాడు.


మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే..

Bigg Boss 8: Third week nominations list..?
Bigg Boss 8: Third week nominations list..?

ఇలా మొత్తానికి ఈ వారం యష్మీ, ప్రేరణ , మణికంఠ, అభయ్, పృథ్వీ , నైనిక , విష్ణుప్రియ, సీత నామినేట్ అయ్యారు. చెత్త రీజన్ లు చెప్పుకుంటూ ఒకరికొకరు నామినేట్ చేసుకుంటూ ఆడియన్స్ కు పిచ్చెక్కించారు. మరి నెక్స్ట్ వారం వీరిలో ఎవరు కొనసాగుతారో తెలియాలి అంటే ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. ఇకపోతే అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. ఇప్పుడు నామినేషన్ లోకి వచ్చారు.. ఎవరిని సేవ్ చేయాలో తెలియక ఇబ్బంది పెట్టేస్తున్నారు. చెత్త రీజన్స్ చెప్పి కొంపముంచారు కదరా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Big Stories

×