E-Paper
Advertisement

Jr Ntr:- మ‌రో కొత్త షోతో బుల్లితెర‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్‌

Jr Ntr:- మ‌రో కొత్త షోతో బుల్లితెర‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్‌
Advertisement

Jr Ntr:- టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్ల‌టానికి అడుగు వేస్తున్నారు. ఓ వైపు మ‌న ద‌క్షిణాది ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తూనే ఉత్త‌రాది ద‌ర్శ‌కుల‌ను లైన్ పెడుతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఇంత బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న బుల్లి తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. టీవీ షోస్‌లో సంద‌డి చేయ‌టం ఎన్టీఆర్‌కు కొత్తేమీ కాదు. ఇది వ‌ర‌కు ఆయ‌న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజ‌న్ 1ను అత్య‌ద్భుతంగా హోస్ట్ చేశారు. ఆ త‌ర్వాత జెమినీ చానెల్‌లో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు అనే ప్రోగ్రామ్‌ను కూడా స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు.

Advertisement

ఈ నేప‌థ్యంలో తార‌క్ మ‌రోసారి బుల్లి తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ తెలుగు చానెల్స్‌లో ఒక‌టైన ఈటీవీ వారు ఓ టాక్ షోను ప్లాన్ చేశార‌ట‌. అందులో ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్నార‌ని టాక్ వ‌స్తుంది. గ‌తంలో రానా హోస్ట్ చేసిన నెం.1 యారి స్టైల్లోనే ఎన్టీఆర్ కొత్త షో ఉంటుందని స‌మాచారం. ఈ ఏడాది అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నెల‌ల్లో ఈ షో ఉంటుంద‌ని, ప‌రిమితంగా సెల‌బ్రిటీల‌తో ఓ సీజ‌న్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు.

ఇక మూవీస్ విష‌యానికి వ‌స్తే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌న ఎన్టీఆర్ 30 సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్ మూవీగా రానుంది. దీని త‌ర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోష‌న్ చేయ‌బోయే వార్ 2లో విల‌న్‌గా న‌టిస్తారు. ఆ వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 31వ సినిమాను షురూ చేస్తారు. మ‌రో వైపు కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ సైతం తార‌క్ కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసిన సంగతి తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×