BigTV English

Ustaad Bhagat Singh:- ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ గ్లింప్స్ డేట్ ఫిక్స్‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే

Ustaad Bhagat Singh:- ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ గ్లింప్స్ డేట్ ఫిక్స్‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే


Ustaad Bhagat Singh:- పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబోలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇంత‌కు ముందు వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ ఇండ‌స్ట్రీ హిట్‌ను కొట్టింది. దీంతో ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల మేకింగ్‌లో త‌న‌దైన స్టైల్‌ను ఫాలో అయ్యే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టంతో అంద‌రిలో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. వీటిని రెట్టింపు చేస్తూ మేక‌ర్స్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. అదేంటంటే ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ గ్లింప్స్‌ను మే 11న విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఉయ్ ఆర్ ఫుల్లీ లోడెడ్ అంటూ రాక్‌స్టార్ దేవి శ్రీప్ర‌సాద్ విడుద‌ల చేసిన వీడియోలో ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ గ్లింప్స్‌ను మే 11న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించేశారు. గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లై 11 సంవ‌త్స‌రాలు అవుతుంది. ఈ సంద‌ర్భంగానే గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అస‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఇక సోష‌ల్ మీడియా షేక్ అయిపోవ‌టం గ్యారంటీ అని సినీ స‌ర్కిల్స్‌లో న్యూస్ వినిపిస్తోంది.


త‌మిళ చిత్రం తెరిని డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ త‌న‌దైన స్టైల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు మార్పులు చేర్పులు చేసి ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ సినిమాను రూపొందిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌త‌గా శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రానున్న ఏడాది ఎన్నిక‌ల‌తో బిజీగా మార‌బోతున్నారు. దీంతో సినిమాల‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారాయ‌న. ఇప్ప‌టికే PKSDTను పూర్తి చేసిన ప‌వ‌న్ ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, OG, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు మ‌రి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×