E-Paper
Advertisement

Jyothy poorvaj: కిల్లర్ గా జగతి మేడం.. వారికి పోటీగా ఫస్ట్ లుక్..!

Jyothy poorvaj: కిల్లర్ గా జగతి మేడం.. వారికి పోటీగా ఫస్ట్ లుక్..!
Advertisement

Jyothy Poorvaj: ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు బుల్లితెర నుంచి వెండితెర పైకి ఎంట్రీ ఇస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ ద్వారా కమెడియన్స్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఎంతోమంది సినిమాలలో కొంతమంది హీరోలుగా కొంతమంది డైరెక్టర్లుగా ఇంకొంతమంది కమెడియన్స్ గా కూడా సెటిల్ అయ్యారు మరోవైపు సీరియల్స్ లో నటించి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిలో మరొక నటి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు తెలుగు బుల్లితెర పై భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి జ్యోతి పూర్వాజ్ ( Jyothy Poorvaj) గురించి చెప్పాల్సిన పనిలేదు.

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా గుర్తింపు..

Advertisement

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఒక్కసారిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, జగతి మేడం గా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితమైంది. ఈమె పలు సీరియల్స్ లోనే కాకుండా సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది. అంతకంటే ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిరంతరం హాట్ ఫోటోలతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు గ్లామర్ షో తో యువతను రెచ్చగొడుతూ ఇంకొక వైపు సాంప్రదాయంగా కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసమే అని చెప్పడంలో సందేహం లేదు. అలా సోషల్ మీడియా ద్వారా పెరిగిన పాపులారిటీతో ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు.

కిల్లర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..

Advertisement

ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం తాను సినిమాలలో నటిస్తున్నట్లు పలు రకాల ఫోటోలను , పోస్టర్లను సైతం విడుదల చేసింది. డైరెక్టర్ పూర్వాజ్ డైరెక్షన్ లోనే ఒక సినిమాలో నటిస్తున్నది. ఈ పూర్వాజ్ ఎవరో కాదు .. జ్యోతీ రాయ్ కి రెండవ భర్త. అయితే తను వివాహం చేసుకున్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచి ,అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలని షేర్ చేస్తూ వచ్చిన జ్యోతి ఆ తర్వాత అనౌన్స్ చేసింది.. మరి ఈ భార్యాభర్తల కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం కిల్లర్. ఈ సినిమా కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

‘కిల్లర్ పార్ట్ -1 డ్రీమ్ గర్ల్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నటి జ్యోతి పూర్వాజ్ అద్దం ముందు ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని మరీ నిలబడి ఉండగా, మరొక చేతిలో కూరగాయల బ్యాగ్ ని పట్టుకుంది. అలాగే అద్దంలో వెనక వైపు రోబోలా కనిపిస్తున్నటువంటి మరొక పోస్టర్ అయితే కనిపిస్తోంది. మొత్తానికి జ్యోతి పూర్వాజ్ మొదటి సినిమాకు సంబంధించి పోస్టర్ కాస్త ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే బుల్లితెర మీద అలరించిన ఈ అమ్మడు మరి వెండితెర మీద ఏవిధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ఇకపోతే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వెండితెర పై సందడి చేశారు. మరి ఈమెకు ఏ విధంగా వెండితెర ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×