BigTV English
Advertisement

Dharmapuri Arvind: హరీష్ కు పోటీగానే కేటీఆర్ పాదయాత్ర.. ఎవరు చేసినా చీపుర్లు.. చెప్పులే.. ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు

Dharmapuri Arvind: హరీష్ కు పోటీగానే కేటీఆర్ పాదయాత్ర.. ఎవరు చేసినా చీపుర్లు.. చెప్పులే.. ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు

Dharmapuri Arvind: వారిద్దరిది ఒకే పార్టీ. ఒకే కుటుంబానికి చెందిన నేతలు కూడా వారు. అయితే వారిద్దరి మధ్యనే రాజకీయ పోటీ వాడి వేడిగా సాగుతోందని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్, హరీష్ రావు.


ఇటీవల కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించడంపై తాజాగా ఎంపీ అరవింద్ స్పందించారు. నిజామాబాద్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో అరవింద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో గాల్లో లెక్కలేస్తూ పరిపాలన సాగించిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి, కుటుంబ పాలన సాగించిన పార్టీగా బీఆర్ఎస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.

మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించడం హాస్యాస్పడంగా ఉందని, కేటీఆర్ పాదయాత్ర చేస్తే చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. రాజకీయాలలో అహంకార భావం పనికిరాదని, కేటీఆర్ కు అహంకారం ఏం మేరకు ఉండాలో అంతకుమించి ఉందంటూ ఘాటుగా విమర్శించారు.


కేటీఆర్ పాదయాత్ర చేపట్టే ముందు తనది పాదయాత్రనా లేక పదవుల యాత్రనా అంటూ స్పష్టం చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని, అందుకే హరీష్ రావు పాదయాత్ర ప్లాన్ చేసుకునే పనిలో ఉండగానే, కేటీఆర్ అందుకు పోటీగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్నారు. కేటీఆర్ నిర్వహించే పాదయాత్ర కుటుంబ కలహాల పాదయాత్రగా అభివర్ణించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అఘాయిత్యాలు ప్రజలు ఇంకా మరువలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో తామిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, హామీలను అమలు చేసే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి రూ.500 బోనస్ వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు అరవింద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు

Also Read: Occult Worship: బొమ్మకు 9 మేకులు.. చుట్టూ తాంత్రిక పూజలు.. కాష్మోరాను తలపించే దృశ్యాలు.. షాకైన గ్రామస్తులు

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జిల్లాకు స్కూలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఎంఐఎం పార్టీపై అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిదని, వక్ఫ్ బోర్డు చట్టం దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు. పార్లమెంటు చట్టాలను ఉల్లంఘిస్తే ఎంఐఎం పై కఠిన చర్యలకు బీజేపీ సిద్ధంగా ఉంటుందని అరవింద్ తెలిపారు.

ఏదిఏమైనా కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరూ ఒకేసారి పాదయాత్ర ప్రారంభించడం పార్టీలోని ఆధిపత్యపోరుకు నిదర్శనమని బీజేపీ విమర్షిస్తోంది. మరి ఈ విమర్శలకు రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×