E-Paper
Advertisement

Kabza Movie:-కె.జి.య‌ఫ్ రేంజ్‌లో ‘క‌బ్జ’.. ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Kabza Movie:-కె.జి.య‌ఫ్ రేంజ్‌లో ‘క‌బ్జ’.. ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Kabza Movie:-ఉపేంద్ర, ఆర్‌.చంద్రు కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘క‌బ్జ’. కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌కుమార్ కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మార్చి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ చూస్తుంటే ప్ర‌తి సీన్‌ను ఎంతో రిచ్‌గా చిత్రీక‌రించారు. 1960 బ్యాక్ డ్రాప్‌లో న‌డిచే గ్యాంగ్ స్ట‌ర్ మూవీ ఇది. కె.జి.య‌ఫ్ టింట్‌, స్టైల్లో ‘క‌బ్జ’ను చిత్రీక‌రించిన‌ట్లు ట్రైల‌ర్‌లో తెలుస్తుంది. ఉపేంద్ర‌ను స‌రికొత్త కోణంలో ఎలివేట్ చేసే సినిమా ఇది.

ఇంకా ఈ చిత్రంలో శ్రియా శ‌ర‌న్‌, క‌బీర్ దుహాన్ సింగ్‌, న‌వాబ్ షా, ప్ర‌మోద్ శెట్టి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌గా, ఏజే శెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జ‌యంతి సంద్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే క‌న్న‌డ సినిమాలు కె.జి.య‌ఫ్‌, కాంతార సినిమాలు ద‌క్షిణాదినే కాదు..బాలీవుడ్‌లోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. మ‌రి క‌బ్జ ఆ లిస్టులో చేరుతుందో లేదో తెలియాలంటే మార్చి 17 వ‌రకు ఆగాల్సిందే.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×