E-Paper
Advertisement

Kajal Aggarwal: బాల‌య్య స‌మ‌స్య‌ని క్యాష్ చేసుకున్న కాజ‌ల్‌

Kajal Aggarwal: బాల‌య్య స‌మ‌స్య‌ని క్యాష్ చేసుకున్న కాజ‌ల్‌
Advertisement

Kajal Aggarwal:NBK 108 Heroine: నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా స్టార్ట్ చేసిన ప్ర‌తీసారి ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌ను ప్రారంభం నుంచి ఇబ్బంది పెట్టే స‌మ‌స్య హీరోయిన్‌. ఆయ‌న‌కే కాదు.. మిగ‌తా సీనియ‌ర్ హీరోలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ సినిమాలకు అదే స‌మ‌స్య‌. NBK 108 మూవీని స్టార్ట్ చేసే సంద‌ర్భంలోనూ అదే స‌మ‌స్య మేక‌ర్స్‌ను తెగ టెన్ష‌న్ పెట్టింది. అయితే ఈ విష‌యంపై ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఎక్కువ‌గా లాగ‌కూడ‌ద‌ని అనుకున్నారేమో ముందుగానే హీరోయిన్ విష‌యాన్ని సెటిల్ చేసేసుకున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను (Kajal Aggarwal) హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు.

కానీ సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్… NBK 108 కోసం భారీ రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసింది. టాక్ ప్ర‌కారం ఏకంగా కాజ‌ల్ రూ.3 కోట్లు డిమాండ్ చేసింది. ఇది వ‌ర‌కే చిరంజీవితో కాజ‌ల్ న‌టించింది. వారి పెయిర్ కూడా బావుండ‌టంతో ఆమె అయితే బాల‌య్య ప‌క్క‌న కూడా సూట్ అవుతుంద‌ని నిర్మాత‌లు భావించారు. అందు కోసం ఆమె అడిగినంత ఇవ్వ‌టానికి వారు రెడీ అయ్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం రీ ఎంట్రీ త‌ర్వాత‌ కాజ‌ల్ మంచి సినిమాల్లోనే న‌టిస్తుంది. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్ 2లో న‌టించింది. ఇప్పుడు బాల‌య్య‌.. NBK 108లోనూ న‌టిస్తుంది.

Advertisement

NBK 108 సినిమా విషయానికి వ‌స్తే ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యింది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో స్టార్ట్ చేయ‌బోతున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రంలో కుర్ర హీరోయిన్ శ్రీలీల కూడా న‌టిస్తుంద‌ని అయితే హీరోయిన్‌గా కాకుండా బాలకృష్ణ కుమార్తెగా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి చిత్రాలు బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందుతోన్న NBK 108పై భారీ అంచనాలున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×