E-Paper
Advertisement

Suryapet : పటేల్ రమేష్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ పార్టీ తరఫున పోటీ..

Suryapet :  పటేల్ రమేష్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ పార్టీ తరఫున పోటీ..
Advertisement

Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ టికెట్ పటేల్ రమేశ్‌ రెడ్డి ఆశించారు. అందుకోసం బలంగా ప్రయత్నాలు చేశారు. ఆయనదే టిక్కెట్ అనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో గురువారం నామినేషన్ కూడా వేశారు. తనకు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నారు. పార్టీ బీ ఫామ్ కోసం ఎదురుచూశారు.

మరోవైపు సూర్యాపేట టిక్కెట్ కోసం సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. కానీ సూర్యాపేట టిక్కెట్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచీ వ్యవహరించింది. నామినేషన్ల గడువుకు ఒక్కరోజు ముందు సూర్యాపేట అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఈ సీటు అనూహ్యంగా మాజీమంత్రి, సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.

Advertisement

టికెట్ రాకపోవడంతో పటేల్ రమేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగం చెందారు. బోరున విలపించారు. ఆ సమయంలో రమేష్ రెడ్డి అనుచరులు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆందోళనకు చేపట్టారు. రమేశ్‌ రెడ్డి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వేల సంఖ్యలో అభిమానులు వెంటరాగా.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు పటేల్ రమేష్‌ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేసినా ప్రజల అభిమానం తనకే ఉందంటున్నారు రమేష్ రెడ్డి. ప్రజల ఆశీస్సులు, అభిమానం ఉన్న స్థానికుడినైన తనను మంచి మెజార్టీతో గెలిపించడానికి సూర్యాపేట ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×