E-Paper
Advertisement

Kalinga: చిన్న సినిమా.. హిట్ అయ్యేలానే ఉందే

Kalinga: చిన్న సినిమా.. హిట్ అయ్యేలానే ఉందే

Kalinga: కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు కళింగ తో హీరో మరియు దర్శకుడిగా రాబోతున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.  సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో  ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇక ఈ ఈవెంట్ లో బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. “ఎవరు ఎంత బిజీగా ఉన్నా.. రోజంతా ఉన్న అలసటను తీర్చుకోవడానికి సినిమాలు చూడటం అనేది మన కల్చర్‌లో భాగం. కరోనా తరువాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాలు వస్తున్నాయి. చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తే భయపెట్టించేలా ఉన్నాయి. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.  ఈ సినిమా మంచి లాభాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

హీరో ధృవ వాయు మాట్లాడుతూ.. ” మా కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నేత రఘునందన్ రావు, నా ఫ్రెండ్ తిరువీర్‌కు థాంక్స్.  ఈ కథకు.. యాకూబ్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ అక్షయ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎడిటర్ నరేష్ సినిమాను అద్భుతంగా మలిచాడు. విజువల్స్ బాగా వచ్చాయి.. వాటికి తగ్గ ఆర్ఆర్ కావాలి. విశ్వ శేఖర ఆర్ఆర్‌తో సినిమా మరో స్థాయికి వెళ్లింది. మంచి పాటలు ఇచ్చిన లిరిసిస్ట్‌కు థాంక్స్. ప్రీతి సుందర్ ఇందులో తన డ్రీమ్ రోల్ పోషించారు. నా టీమ్  సపోర్ట్ వల్లే ఈ సినిమాను నేను ఇంత బాగా తీయగలిగాను. సంజయ్ నటనను చూసి అంతా షాక్ అవుతారు. ఇకపై పెద్ద చిత్రాల్లో విలన్‌గా, హీరోగా కనిపిస్తాడు. ప్రగ్యా నయన్ తన పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ చిత్రం తరువాత చాలా పెద్ద ఆఫర్లు వస్తాయి. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసిన చాలా మంది కాంతారనా, విరూపాక్షనా?.. మంగళవారంలా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ ఇదొక కొత్త కాన్సెప్ట్. సెప్టెంబర్ 13న ఈ చిత్రం చూడండి. చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

తిరువీర్ మాట్లాడుతూ.. “కథ రాసి.. డైరెక్టర్ చేసి.. నటించడం అంటే మామూలు విషయం కాదు. ఘాజి సినిమా చేసినప్పుడు మేం ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. కిరోసిన్ కథను రాసి, దర్శకత్వం చేసి నిర్మాతకు లాభాల్ని తీసుకొచ్చి పెట్టాడు. కళింగ టీజర్ చూసి భయపడ్డాను. తన బాటను తానే నిర్మించుకున్నాడు. కళింగ మూవీని ఐదు వందలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మా అందరికీ ధృవ స్పూర్తి. సెప్టెంబర్ 13న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాతో మా వాడికి మరింత పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు

ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. ‘కళింగ రిలీజ్ కోసం చాలా ఎదురుచూస్తున్నా.మా టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఫోన్ చేసి ప్రశంసించారు. సినిమా చూశాక కూడా అలాంటి కాల్స్ వస్తాయి. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ధృవ వాయు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి”  అంటూ ముగించింది. మరి ఈ సినిమాతో ఈ టీమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×