E-Paper
Advertisement

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..
Advertisement

Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు అంశాలపై చర్చింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్, డెసిషన్స్ వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లు పైబడిన సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, 70 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంతా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందొచ్చన్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 6 కోట్లకు పైగా సీనియర్ సిటిజన్స్ లబ్ధి పొందనున్నారన్నారు.

Also Read: మేము ఉన్నంత వరకూ.. దానిని టచ్ కూడా చేయలేరు : రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందన

Advertisement

ఇదిలా ఉంటే.. ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డును అందిస్తుంది. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి.

 

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×